బుల్లితెరపై హాట్ యాంకర్ ఇమేజ్ ఉన్న యాంక‌ర్ శ్రీముఖి సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ కూడా అదే ఇమేజ్ కోసం పాకులాడింది. ఒక‌టి రెండు సినిమాలు వ‌దిలేస్తే ఆ త‌ర్వాత శ్రీముఖి సినిమాలు మొహం మొత్తేయ‌డంతో ఇప్పుడు తిరిగి బుల్లితెర మీదే నానా హంగామా చేస్తోంది. ఇక ఇప్పుడు శ్రీముఖి బిగ్‌బాస్ లాంటి కాంట్ర‌వర్సీ షోలో కూడా ర‌చ్చ చేసేందుకు రెడీ అవుతోంది.


తెలుగులో త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌య్యే బిగ్‌బాస్ - 3 సీజ‌న్లో ఆమె కూడా ఓ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేస్తోంద‌ట‌. నాగార్జున హోస్ట్‌గా చేసే ఈ షో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. షోలో వెళ్లే ముందు మ‌రింత హాట్ ఇమేజ్ కోరుకుంటుందో ఏమోగాని ఆమె ఇటీవ‌ల మ‌రి బ‌రి తెగించేసి హాట్ స్టిల్స్ సోష‌ల్ మీడియాలో వ‌దులుతోంది.


ఆమె గ‌త స్టిల్స్ క‌న్నా ఈసారి గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్ వేసుకొని హాట్ ఫోటో షూట్ నిర్వహించింది. టీషర్ట్ పైకి లేపిమరీ నాభి సౌందర్యాన్ని ఎరగా చూపిస్తూ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఫొటోలు చాలా హాట్‌గా ఉండ‌డంతో అవి బాగా షేర్లు అవుతున్నాయి. శ్రీముఖి బిగ్ బాస్‌లో ఉంటే ఆమె ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత మ‌స్తు మ‌జా ఉంటుందే..!



మరింత సమాచారం తెలుసుకోండి: