ప్రధమ స్వాతంత్ర సంగ్రామం జరిగిన 1857 సంవత్సరం కన్నా ముందుగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన చరిత్ర. కేవలం అక్కడక్కడ చారిత్రక పుస్తకాలలో మాత్రమే చాల కొద్దిగా కనిపిస్తుంది. దీనికితోడు ఆరోజులలో అప్పటికి పత్రికలు కూడ లేవు కాబట్టి కేవలం శాసనాలలో లభించిన ఆధారాలను బట్టి ‘సైరా’ కథను అల్లారు. 

ఈ కథను డెవలప్ చేయడానికి పరుచూరి గోపాలకృష్ణతో పాటు సుమారు పదిమంది రచయితల టీమ్ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర గురించి చాల పరిశోధనలు చేసారు. చివరకు సినిమాకు సరిపడే భావోద్వేగాలు ఆయన జీవితంలో ఉన్నాయి అని నిర్ధారణకు వచ్చిన తరువాత ‘సైరా’ సినిమా ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంది. 

200 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ విషయంలో అనేక ఆసక్తికర విషయాలతో పాటు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ముగ్గురు భార్యలను పెళ్ళి చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. 

దాదాపు 165 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలతో పాటు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మునిముని మనవలు అంటూ ఇప్పుడు మీడియా ముందు హడావిడి చేస్తున్న సుమారు 100 మంది ఉయ్యాలవాడ ముగ్గురు భార్యలకు పుట్టిన సంతతి అని అంటారు. దీనితో వీరివ్వరు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి డైరెక్ట్ రిలేషన్ కాదు. అయితే తమ తాత ముత్తాతల వరసకు చెందిన వ్యక్తి పై భారీ సినిమా తీయడం అందులో చిరంజీవి నటిస్తూ ఉండటంతో వారందరికీ ఆశ పెరిగి ఇలా మెగా కాంపౌండ్ నుండి 8 కోట్లు డిమాండ్ చేస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి విషయాలకు సంబంధించిన లీగల్ సమస్యలు కోర్టులలో చెల్లుబాటు అవ్వకపోయినా హడావిడి చేయడానికి అలజడి చేయడానికి బాగా పనికి వస్తాయి కాబట్టి ఈ సున్నిత సమస్యను తెలివిగా పరిష్కరించుకోవాలి అన్న ఆలోచనలలో ప్రస్తుతం చిరంజీవి చరణ్ లు ఉన్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: