న‌ట‌సింహం నందమూరి బాల‌కృష్ణ హీరోగా  దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో  ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా  తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో బాలయ్య  ఇద్దరు కవలల పాత్రల్లో నటిస్తున్నారట. అందులో ఒక పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. అసలు బాలయ్యను ఎమోషనల్ పాత్రలో జనం చూస్తారా అనేది అనుమానమే. అయితే చిత్రబృందం మాత్రం సినిమాలో సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుందని చెబుతుంది.     


ఇక ఈ సినిమాకు 'రూలర్' అని టైటిల్ పెట్టినట్లు సమాచారం.  జ‌గ‌ప‌తిబాబు కూడా  ఈ చిత్రంలో పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నారు.   ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు.   సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.  త్వరలోనే ఈ సినిమా  రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: