యాంగ్రీ హీరో రాజశేఖర్ కెరీర్ కి `పీఎస్ వీ గరుడ వేగ` ఊహించని టర్నింగ్ పాయింట్. ఎన్ ఎస్ జీ కమెండోగా రాజశేఖర్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. జాతీయ అవార్డ్ గ్రహీత ప్రవీణ్ సత్తారు టేకింగ్ కి పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు కురిసాయి. ఒక కొత్తదనం ఉన్న కథతో గ్రిప్పింగ్ గా సినిమా తీస్తే విజయం సాధ్యమేనని ప్రూవైంది. అందుకే ఆ సినిమా తర్వాత రాజశేఖర్ మరోసారి వైవిధ్యం ఉన్న కథనే ఎంపిక చేసుకుని `అ!` ఫేం ప్రశాంత్ వర్మతో సినిమా చేశారు.

 

రాజశేఖర్- ప్రశాంత్ వర్మ కాంబినేషన్ మూవీ `కల్కి` ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి విమర్శలు వచ్చినా .. ఓ డిఫరెంట్ ప్రయత్నం చేశామని రాజశేఖర్ చెబుతున్నారు. నా నటనకు మంచి పేరొచ్చింది. నా లుక్స్.. మేనరిజమ్స్ బాగున్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కథ.. నా పాత్ర.. ప్రశాంత్ వర్మ టేకింగ్... బాగున్నాయని .. ఇంటర్వెల్ సీన్.. క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలొచ్చాయని నేటి ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 

ఈ సినిమా తర్వాత ఏఏ ప్రాజెక్టులు చేయబోతున్నారు?  కుమార్తెలు శివానీ- శివాత్మికలతో కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు రాజశేఖర్ ఫుల్ క్లారిటీనిచ్చారు. పెద్దమ్మాయి శివాని సినిమా మొదలై అనుకోని కారణాలతో ఆగిపోయిది. నిజానికి శివాత్మిక `దొరసాని` కంటే ముందు శివాని కథానాయికగా సినిమా మొదలైంది. కానీ మధ్యలో ఆగిపోయింది. అమ్మాయిలు ఇద్దరూ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మేం కలిసి సినిమా చేస్తాం.

 

అందులో జీవిత కూడా నటిస్తుంది. మా పిల్లలు ఇద్దరూ నాకో కథ చెప్పారు. చాలా బాగుంది. సి. కళ్యాణ్ కి చెప్తే నేనే నిర్మిస్తానన్నారు. కుటుంబకథా చిత్రమది... అని తెలిపారు. సోలోగా చేయబోయే సినిమా ఏది? అని ప్రశ్నిస్తే.. ఇంకా ఏదీ కన్ఫామ్ కాలేదని అన్నారు. ``ఇంకా ఏదీ అనుకోలేదు. కథలు వింటున్నాం. ప్రవీణ్ సత్తారు `గరుడవేగ 2` స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. పార్ట్ వన్ తో పోలిస్తే.. నెక్స్ట్ లెవల్లో ఉంటుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: