ఆది సాయి కుమార్ నటించిన చిత్రం `బుర్రకథ`. మిస్తీ చక్రవర్తి - నైరాషా నాయికలు. ప్రముఖ రచయిత డైమండ్ రత్నంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్ లు ఇప్పటికే ఆసక్తిని పెంచేశాయి. సెన్సార్ ఇబ్బందుల్ని అధిగమించి ఈనెల 5న రిలీజ్ చేస్తున్నామని ఇటీవల దర్శకహీరోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకే బుర్ర పూర్తి ఆపోజిట్ కోణాల్లో ఆలోచిస్తే ఎలా ఉంటుంది? అలా రెండు బుర్రలున్న కుర్రాడి కథేంటి? అన్నది తెరపై చూపిస్తున్నారు.

 

ఫన్.. కామెడీ.. ఎమోషన్.. ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా అన్ని కోణాల్లోనూ ఈ సినిమా మెప్పిస్తుందని ట్రైలర్ చూశాక అంచనా ఏర్పడింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కి ముందే శాటిలైట్ బిజినెస్ పూర్తయిందని తెలుస్తోంది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ జీటీవీ రూ.2కోట్లు చెల్లించి రైట్స్ ని ఛేజిక్కించుకుందట. ఇక ఈ సినిమా వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆదికి .. జర్నలిస్టు వృత్తి నుంచి పరిశ్రమకు వచ్చి దర్శకుడు అవుతున్న డైమండ్ రత్నబాబుకు ఎంతో ఇంపార్టెంట్.

 

ముఖ్యంగా రత్నబాబు డెబ్యూ సినిమా కావడంతో సక్సెస్ కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నానని తెలిపారు. డైమండ్ రత్నబాబు తొలుత `హాస్యానందం` అనే సంపూర్ణ హాస్య మాస పత్రికలో అసోసియేట్ గా పని చేశారు. ఆ క్రమంలోనే దర్శకుడవ్వాలన్న లక్ష్యంతో పరిశ్రమలో అడుగు పెట్టారు. తొలుత రచయితగా నిరూపించుకుని ఆ దారిలోనే 15 ఏళ్ల ప్రయాణం సాగించారు. ఇంతకాలానికి బుర్రకథ చిత్రంతో దర్శకుడిగా తొలి అవకాశం దక్కించుకున్నాడు.

 

తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నానని.. ఈ సందర్భంగా మీడియా నుంచి వచ్చిన తనకు పాత్రికేయ కుటుంబ సభ్యులే అండగా నిలవాలని డైమండ్ రత్నబాబు అభ్యర్థించారు. తొలి ప్రయత్నమే విజయం అదుకుంటాననే ధీమాని కనబరుస్తున్నారు. మీడియా నుంచి వచ్చి రచయితగా.. అటుపై డైరెక్టర్ గా ప్రమోషన్ అందుకోవడం అంటే ఆషామాషీ కాదు. పదిహేనేళ్ల అకుంఠిత ధీక్ష నేటికి ఫలిస్తోంది. రచయితలు దర్శకులుగా రాణిస్తున్న ఈ ట్రెండ్ లో తన హార్డ్ వర్క్ ఫలిస్తుందని రత్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: