ది లయన్ కింగ్ సినిమా జులై 19 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  1994 లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమాకు ఇది రీమేక్.  అప్పట్లో కార్టూన్ బేస్ లో వచ్చింది.  ఆ మూవీ సూపర్ హిట్టైంది.  ఆధ్యంతం హాస్యంతో తెరకెక్కింది.  ఇప్పుడు దానిని కార్టూన్ బేస్ లో కాకుండా.. విజువల్ గ్రాండ్ గా సినిమాను తెరకెక్కించారు.  


డిస్ని తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది.  పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుండటంతో పాటు ఎవెంజర్స్, అవతార్ రికార్డులపై కన్నేసింది.  ఒకవేళ పాజిటివ్ వైబ్ కు తగ్గట్టుగా సినిమా హిట్టయితే... కింగ్ ఖాతాలో రికార్డులు సాధించడం ఖాయం.  


అప్పటి వరకు అడవికి రాజుగా ఉన్న సింహం... వయసు పెద్దదైపోతుంది.  తనకు వారసుడిని గుర్తించి ఆ వారసుడికి బాధ్యతలు అప్పగించడంతో సినిమా ముగుస్తుంది.  కథ కథనాలు అన్ని బాగున్నాయని టాక్.  ట్రైలర్ కూడా దీన్ని రుజువు చేసింది.  జులై 19 వ తేదీన హాలీవుడ్ తో పాటు ఇండియాలో సౌత్, బాలీవుడ్ లో కూడా రిలీజ్ కాబోతున్నది.  


ఇండియన్ భాషల్లో ఈ మూవీని డబ్బింగ్ చేశారు.  ఏదో సాదాసీదాగా డబ్బింగ్ చేయకుండా.. ప్రముఖులతో డబ్బింగ్ చెప్పించారు.  ఆ వాయిస్ సినిమాకు ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.  చైనాలోనూ అత్యధిక స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇప్పుడు వస్తున్న టాక్ రిలీజ్ తరువాత కూడా వస్తే.. సినిమా హిట్టవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: