బాలీవుడ్ లో అందాల ప్రదర్శనలో సోనమ్ కపూర్ ఎప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఫ్యాషన్ వరల్డ్ ను షేక్ చేయగలదు. నేటి జనరేషన్ లో ది బెస్ట్ అని.. తనలా వేరొక కథానాయికకు సాధ్యం కాదని ప్రూవ్ చేసింది. అందుకే అభిమానులు సోనమ్ పరిచయం చేసే ఫ్యాషన్స్ & ట్రెండ్స్ ని నిరంతరం పరిశీలిస్తుంటారు. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం లేనిదే సోనమ్ ఆ డ్రెస్ ని ధరించేందుకు ఇష్టపడదని ఫ్యాషన్ స్పెషలిస్టులు.. డిజైనర్లు చెబుతుంటారు.


ఇటీవలే కేన్స్ రెడ్ కార్పెట్ పై సోనమ్ హొయలు కుర్రకారుపై మత్తు చల్లాయి. సరికొత్త ఫ్యాషన్ గోల్స్ ని యూత్ కి నిర్ధేశించింది సోనమ్. ఆ ఈవెంట్ ని మర్చిపోక ముందే ఇదిగో ఇలా కొత్తగా తనని తాను మరోసారి ఎలివేట్ చేసుకుంది ఈ బ్యూటీ.నేటితో ఇన్ స్టాగ్రమ్ లో 2 కోట్ల మంది (20 మిలియన్) ఫాలోవర్స్ ని సోనమ్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా తన అభిమానుల కోసం ఓ స్పెషల్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది.


ఈ ఫోటోలో ఆలివ్ గ్రీన్ డ్రెస్ లో మైమరిపించింది. హాఫ్ షోల్డర్ టైట్ ఫిట్ ఎలివేషన్ లో సోనమ్ అందాలు హైలైట్ అయ్యాయి. కాంబినేషన్ గా బ్లాక్ మెటాలిక్ డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ తో మురిపించింది. ``2 కోట్ల మంది అభిమానుల కోసం ఈ ఫోటో ..` అంటూ పోస్ట్ చేసింది. సోనమ్ ప్రస్తుతం `ది జోయా ఫ్యాక్టర్` అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దుల్కార్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: