గత ఏడాది కాలంగా మీ టు ఉద్యమం పుణ్యమా అని ఎంతో మంది స్టార్ హీరోయిన్లు, ఐటెం సాంగులు చేసే హీరోయిన్లు, సింగర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎంతోమంది ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎవరి నుంచి అయితే వేధింపులు ఎదుర్కొన్నారో ? వారిని ఓ ఆటాడుకున్నారు. చివరకు ఈ ఉద్యమం తీవ్రమైన ప్రకంపనలు రేపింది.


ఇప్పుడు బాలీవుడ్ సీనియ‌ర్ హాట్ హీరోయిన్ మ‌ల్లికా శెరావ‌త్ కూడా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టింది. కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత మల్లిక బూ సబ్కి ఫేటేగి సినిమాలో న‌టించింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో ఎంతో మంది లైంగిక వేధింపులు ఎదుర్కొన్న‌ట్టే తాను కూడా ఓ దర్శకుడి నుంచి ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న‌ట్టు ఆమె చెప్పింది.


ఓ పాట చిత్రీకరించేటప్పుడు ఆ దర్శకుడు తనను చాలా వేధించాడని.... నా నడుమును అందంగా చూపిస్తానంటూ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆమె వాపోయింది. అంతటితో ఆగకుండా అతడు నా నడుము పై కోడి గుడ్లు పెట్టి చాలా నీచాతి నీచంగా వ్యవహరించటంతో నాకు చాలా బాధ అనిపించింద‌ని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తెర వెనుక హీరోలు మరియు దర్శకులతో సన్నిహితంగా ఉండక పోవడం వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాన‌ని కూడా ఆమె చెప్పుకొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: