బాహుబలి లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో  సాహో సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రూ.250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగ‌స్టు 15న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ భారీ యాక్షన్ సినిమా టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 


ప్ర‌స్తుతం యూర‌ప్‌లోని ఆస్ట్రియాలోని వివిధ లొకేష‌న్ల‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది.  ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ షూటింగ్ స్టిల్ రిలీజ్ చేయ‌డంతో పాటు ‘‘హాయ్ డార్లింగ్స్!! ఆస్ట్రియాలోని ఇన్స్‌బర్క్, టిరోల్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఇప్పటివరకూ నాకు కలిగిన గొప్ప అనుభూతి ఇది’’ అంటూ ప్రభాస్ పేర్కొన్నాడు.


ఇదిలా ఉంటే యూవీ క్రియేష‌న్స్ సాహో ప్ర‌మోష‌న్‌ను చాలా వెరైటీగా స్టార్ట్ చేసింది. సాహో ఫ‌స్ట్ సాంగ్‌ కోసం అభిమానులు వాట్సాప్ ఛాట్ చేస్తున్నట్లుగా ఓ వీడియోని ట్వీట్ చేసింది. అంతేకాక.. పాట ఏంటో కనిపెట్టాలని అభిమానులకు సవాల్ విసిరింది. మ‌రి సాహో స‌వాల్‌లో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంత వ‌ర‌కు విజ‌యం సాధిస్తారో ?  చూడాలి. 


సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేశ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, చంకీ పాండే, మందిరా బేడీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: