ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా సెలబ్రిటీలు కలిసి డేట్ వెళ్ళడం చాలా కామన్. అయితే డేట్ అంటే చాలా అర్థాలున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో మరో డేటింగ్ వ్యవహారం బయటపడింది. యూరి సినిమాతో పాపులర్ అయిన విక్కీ కౌశల్ ఈసారి సెన్షేషనల్ వ్యక్తిగా మారాడు. హీరోయిన్ మాళవిక మోహనన్, విక్కీ కౌశల్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం మాళవిక విజయ్ దేవరకొండ సరసన హీరో అనే సినిమాలో నటిస్తోంది. నిజానికి విక్కీ కౌశల్ మాళవికతో నడుపుతుంది తొలిప్రేమ కాదు. మాళవిక పరిచయం అవ్వకముందు మరో అమ్మాయితో డేటింగ్ లో ఉండేవాడు ఈ హీరో.

మాళవిక పరిచయం అవ్వడం, యూరి సినిమా హిట్ అవ్వడం ఒకేసారి జరగడంతో ఆమెను లక్కీగా ఫీలవుతున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ప్రతిరోజు సాయంత్రాలు కలుసుకుంటున్నారు. దాదాపు 6-7 నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నప్పటికీ ఎక్కడా బయటకు పడలేదు. చివరకు ఓ హీరోయిన్ వల్ల ఈ మొత్తం వ్యవహారం బట్టబయలైందని లేటెస్ట్ న్యూస్. ఆమె మరెవరో కాదు రెబల్ హీరోయిన్ రాధికా ఆప్టే. చాలా విషయాలపై ఓపెన్ గా మాట్లాడే రాధికా ఆప్టే విక్కీ-మాళవిక ఎఫైర్ ను బయటపెట్టింది. తన తమ్ముడు కూడా మాళవికకు బాగా క్లోజ్ కాబట్టి విక్కీ-మాళవిక ఎఫైర్ గురించి తనకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తుంటాయని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

రీసెంట్‌గా ఓ టీవీ షోలో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ బయటపెట్టేసింది రాధికా ఆప్టే. ఇకనైనా విక్కీ-మాళవిక తమ ఎఫైర్ ను పబ్లిక్ గా ఒప్పుకోవాలని, అలా చేయడం వల్ల పుకార్లు రాకుండా ఉంటాయని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది. కాస్టింగ్ కౌచ్ లాంటి చాలా విషయాలపై బోల్డ్ గా మాట్లాడే ఈ రాధిక ఇప్పుడిలా జంటల ఎఫైర్లను కూడా బయటపెట్టడం మొదలుపెట్టిందని బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. కాకపోతే క్యారెక్టర్ నచ్చితే న్యూడ్‌గాను నటించే రాధిక ఇలాంటి కామెంట్స్ చేయడంలో పెద్ద వింతేముందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఇందులో సస్లు ప్రేమ అనేది ఎక్కడుంది. వేరే ఇంకేదో కనిపిస్తుంది అని కూడా మాట్లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: