ఇండ‌స్ట్రీలో అగ్ర హీరోలు క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తే చూడాల‌న్న కోరిక అంద‌రికి ఉంటుంది. ఈ విష‌యంలో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక్క‌డే మ‌హేష్‌, ప‌వ‌న్‌, రామ్ లాంటి హీరోల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశాడు. ఒక‌ప్పుడు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ లాంటి సీనియ‌ర్లు ఎన్నో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో చేసి వాళ్ల అభిమానుల‌ను ఖుషీ చేశారు. 


ఇటీవ‌ల హీరోల రెమ్యున‌రేష‌న్లు, మార్కెట్ పెరిగిపోవ‌డంతో ఒకే సినిమాలో ఇద్ద‌రు పెద్ద హీరోలు ఉంటే భారీగా రెమ్యున‌రేష‌న్లు ఇవ్వాల్సి వ‌స్తోంది. ఇద్ద‌రు హీరోల ప‌క్క‌న ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్లు ఉండాలి. ఈ లెక్క‌న ఖ‌ర్చు త‌డిసిమోపెడు అవ్వ‌డంతో ఈ రిస్క్ చేసేందుకు నిర్మాత‌లు ముందుకు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే యాంగ్రీయంగ్‌మేన్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ చిరంజీవి, బాల‌య్య సినిమాల్లో విల‌న్‌గా న‌టిస్తార‌న్న ప్ర‌చారం కొద్ది రోజులుగా జ‌రుగుతోంది.


తాజాగా క‌ల్కి ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న రాజ‌శేఖ‌ర్ ఈ రోజు త‌న ఇంట్లోనే మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ సినిమాలో మీరు నటిస్తున్నారట కదా ? అన్న ప్రశ్నకు రాజ‌శేఖ‌ర్ న‌వ్వుతూ ఆన్స‌ర్ చేశారు. గ‌తంలో ఇలాంటి వార్త‌లు చాలానే వ‌చ్చాయ‌ని.. చిరంజీవి గారు- నేను కలిసి చేస్తామని కొందరు రాశారు. ఈ పుకార్లు ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతా అని మ‌రోసారి న‌వ్వేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: