మిస్టర్ మజ్ఞు ఫ్లాప్ అయినప్పటికి ఏదో రకంగా అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమా సెట్ అయింది. గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ సెట్స్ మీదకు మాత్రం వెళ్లేది ఎప్పుడో ఏది తెలియడం లేదని ఫిల్మ్ నగర్ సమాచారం. దీనికి పెద్ద పెద్ద కారణాలేమీ లేవు. కేవలం హీరోయిన్ దొరక్కపోవడమే. ఇప్పటిదాకా ఈ సినిమాలో నటించడానికి హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ ఫైనల్ అయితే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్దాం అని ఎదురు చూస్తున్నారు. 

అఖిల్ కు మొదటి నుంచీ ఇదే సమస్య. అతని సినిమాలకు హీరోయిన్లు సెట్ కావడం ఎప్పుడూ లేటే. అదే ఈ సినిమాకు కూడా రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అఖిల్ సినిమాకు హీరోయిన్ ఎంపిక బాధ్యతను నిర్మాత బన్నీవాస్ టేకప్ చేసినట్లు గతంలోనే చెప్పారు.  బన్నీవాస్ వీలయినంత వరకు కొత్త హీరోయిన్ నే వెదుకుతున్నారని మరో న్యూస్. 

గతంలో కూడా అఖిల్ రెండు సినిమాలకు కొత్త హీరోయిన్ల సరసనే నటించాడు. ఇప్పుడు ఇది నాలుగో సినిమా. ఈ సినిమా కూడా అదే పంథా ని కొనసాగించేలా కనిపిస్తోంది. ఇటీవలే నిర్మాత బన్నీ వాస్ తను సాయిధరమ్ తేజ్ తో చేసే సినిమా కోసం కూడా కొత్త హీరోయిన్ కోసం వెదికి, మళ్లీ మనసు మార్చుకుని రాశీఖన్నాను తీసుకున్నారు. అఖిల్ సినిమా కోసం మాత్రం వెదుకులాట కొనసాగుతోంది. మరి ఇంకెన్ని రోజులు హీరోయిన్ కోసం వెతుకుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: