మే నెలలో మహర్షి సినిమా తప్ప మరే సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మహర్షి కూడా సూపర్ హిట్ అంటూ గొప్పలు చెప్పుకున్నారు కానీ, అనుకున్నంత హిట్ అయితే కాలేదు. ఈ విషయం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోను అందరికి తెలిసిందే. కానీ జూన్ నెల మాత్రం రిలీజైన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. లో బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు జూన్ నెలలో విడుదలవడమే కాదు ఆ సినిమాలు ప్రేక్షకులు మెచ్చేలా వున్నాయి. జూన్ నెలలో మూడు సినిమాలు హిట్ అవడం గొప్ప విషయమే. ఎన్నికల అంచనాల నడుమ విడుదలైన కార్తికేయ హిప్పీ సినిమా జూన్ 6న విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఇంకా చిన్న చితకా సినిమాలు చాలా జూన్ నెలలో విడుదలయ్యాయి కానీ వాటిలో గేమ్ ఓవర్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మల్లేశం, బ్రోచేవారెవరురా సినిమాలు మాత్రమే ప్రేక్షకులు మెచ్చుకునేలా వున్నాయి.  

తాప్సి నటించిన గేమ్ ఓవర్ జూన్ లోనే విడుదలైంది. హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈసినిమాకి హిట్ టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక కొత్త హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకి హిట్ టాక్ తో పాటుగా వచ్చిన మల్లేశం హిట్ అన్నా.. కమర్షియల్ గా హిట్ పడలేదు. మిగతా సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర బోల్తా పడడంతో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కలెక్షన్స్ కూడా బావున్నాయి.

సినిమాలో దమ్ముంటే ఆ సినిమాకి కలెక్షన్స్ రావడం పెద్ద విషయం కాదని ఏజెంట్ ఆత్రేయ నిరూపించింది. ఏజెంట్ ఆత్రేయ రెండో వారంలోను మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది. ఇక జూన్ చివరి వారంలో పోటీ పడ్డ కల్కి, బ్రోచేవారెవరురా సినిమాల్లో కల్కి సర్ధుకోగా.. బ్రోచేవారెవరురా సినిమా సూపర్ హిట్ అయ్యింది. శ్రీ విష్ణు, నివేత థామస్ నేచురల్ నటనకు, సినిమాలో ఉన్న కామెడీకి ప్రేక్షకులు పడిపోవడమే కాదు.. థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. మరి జూన్ ఆరంభంలో ఎలా వున్నా చివరిలో మాత్రం బ్రోచేవారెవరురా తో ఇండస్ట్రీకి మంచి హిట్ అందించింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: