ప్రగ్యా జైశ్వాల్.. ఈ పేరు గుర్తుండని వాళ్ళెవరు ఉండరు. 'కంచె', 'నక్షత్రం' సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య పెద్దగా ఎక్కడా కనిపించకపోయేసరికి మరిచిపోయారా..? అందుకే జనాలు మరిచిపోతారనే అప్పుడప్పుడు నేనున్నాను అంటూ ప్రగ్యా తనంతట తానే గుర్తు చేస్తుంటుంది.
పాపం ప్రగ్యా చేసింది అడపాదడపా సినిమాలే హిట్ వచ్చిన సినిమాలు కూడా సరిగ్గా లేవాయె. అందుకే ఒక్క హిట్ అయినా పడుతుందా అని ఎంతగానో చూస్తున్నప్పటికీ హీరోయిన్‌గా నటించండి అని సంప్రదించే దిక్కే లేకుండా పోయింది. 

ఎంత తనలోని గ్లామర్ ని చూపించినా.. ఈ అమ్మడికి మాత్రం అవకాశాలు రావట్లేదు. అయితే ఇంట్లో ఒంటరిగా కూర్చొని కూర్చొని బోర్ కొడుతోందేమో గానీ.. నెట్టింట్లో ఫుల్‌ ఫ్రీడమ్‌తో హాట్‌ ఫోటో షూట్స్‌ పోస్ట్‌ చేస్తూ టైం పాస్ చేస్తోంది. ఇలా అప్పుడప్పుడు హాట్ హాట్‌గా టూ పీస్‌లో కనిపిస్తూ అభిమానులను, నెటిజన్లను కనువిందు చేస్తోంది ప్రగ్యా. టూ పీస్‌ కాస్ట్యూమ్‌, బోటమ్‌లో జీన్స్‌ ప్యాటర్న్‌ పొట్టి నిక్కరేసి మరి ఇన్‌డైరెక్ట్‌గా ఎంత గ్లాంస్ షో అయినా చేస్తానంటు సంకేతాలు పంపుతుంది. 

ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అందాల ఆరబోతను చూసి కొందరు నెటిజన్లు హవ్వా అని ఆశ్చర్యపోతుంటే మరికొందరు ఆస్వాదిస్తున్నారు. పాపం.. ఈ రేంజ్‌లో నెట్టింట అందాలు ఆరబోస్తున్న ఈ బ్యూటికి ఎవరైనా అవకాశం కల్పిస్తే మంచిది బాబోయ్ లేకపోతే రాను రాను ఎంతకైనా తెగిస్తుంది.. అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మరి మన వాళ్ళు ప్రగ్యా కి ఎందుకు ఛాన్సులివ్వడం లేదో పాపం. కనీసం క్రిష్ అయినా పట్టించుకుంటే బావుండును.


మరింత సమాచారం తెలుసుకోండి: