విజయ్ దేవరకొండ-శాలినీ పాండే జంటగా నటించిన హిస్టరీ రికార్డ్స్ బ్రేక్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో విజయ్ మెడికల్ స్టూడెంట్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో విజయ్ శాలినీల రొమాన్స్, లిప్ లాక్స్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేశాయి. బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఇటీవల బాలీవుడ్‌లోను షాహిద్ కపూర్-కియారా అద్వాని తో తెరకెక్కించగా 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. మళ్ళీ అలాంటి మరో సినిమా టాలీవుడ్‌లో రాబోతోంది. కన్నడ క్యూటీ రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రెండోసారి జంటగా నటిస్తున్న సినిమా ‘డియర్ కామ్రేడ్’. 

యూత్ ఫుల్ లవ్ స్టోరీతో సాగే ఈసినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈసినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈసినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ చాలానే ఉన్నాయట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్, లిప్ కిస్ లు కాస్త ఘాటుగానే ఉంటాయని తెలుస్తోంది. ఈ రొమాంటిక్ సీన్స్ కి రష్మిక ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ఓకే చెప్పేసిందని టాక్. సెకండ్ హాఫ్ లో యూత్ కి కనెక్ట్ అయ్యే ఓ రొమాంటిక్ సాంగ్ అయితే చాలా బాగా వచ్చిందని టాక్. ఆల్రెడీ గీత గోవిందం లో కలిసి నటించారు కాబట్టి ఇప్పుడు ఇబ్బందిగా ఫీలవలేదట.

ఇక ఈసినిమా జులై 26 న సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ ఈసినిమాను డైరెక్ట్ చేసాడు. ఇక  ఈసినిమా తరువాత విజయ్, క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరో వైపు విజయ్ తమ్ముడు ఆనంద్ దొరసాని తో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో ఆనంద్ కి జంటగా జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మికకి కూడా ఈ సినిమా డెబ్యూ కావడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: