'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' అనే షార్ట్ ఫిల్మ్ తీసి సంచలనం సృష్టించాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇండియాలో ఎవరు చెయ్యని ప్రయోగాన్ని ఈ సినిమాతో చేసి మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు ఆర్జీవి. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో చేసిన ఈ సినిమాలో ఆమెను న్యూడ్ గా చూపించి సినిమాను ఆన్ లైన్ లో గత సంవత్సరం జనవరిలో విడుదల చేసి బీభత్సమైన డబ్బులు దండుకున్నారు రామ్ గోపాల్ వర్మ.


ఈ నేపథ్యంలో తాజాగా రామ్ గోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మాల్కోవా పై ట్విట్టర్ లో...మరోసారి వర్మ మియా మాల్కోవా ప్రస్తావన తెచ్చారు. ఇటీవల జులై 1వ ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ పోర్న్ స్టార్ ను తలుచుకున్నారు రామ్ గోపాల్ వర్మ. సాధారణంగా అయితే ఎవరి జన్మదినాలకు ఎప్పుడూ కూడా విశేష్ చేయరు. చాలా రేర్‌గా కొందరికి మాత్రమే బర్త్ డే విషెస్ చెబుతుంటారు.


మియా మాల్కోవా తనకు ఎంతో స్పెషల్ కాబట్టి ఆమెకు ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు ఈ వివాదాస్పద దర్శకుడు. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మియా మాల్కోవా... నువ్వు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నీ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తున్నాను. ఎందుకుంటే నువ్వు నీ పర్సనాలిటీతో ఎంతో మందికి సంతోషం పంచుతున్నావు. గాడ్ అండ్ సెక్స్ విషయంలో నిజమైన నిజం ఏమిటో అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నావు... అంటూ వర్మ ట్వీట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: