‘సాహో’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. ఈనేపధ్యంలో ‘సాహో’ పాటల చిత్రీకరణ జరిగిన యూరప్ లోని ఆస్ట్రియా దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసిన ఈమూవీ పాటలకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేస్తూ  ఆదేశ పరిస్థితుల గురించి అదేవిధంగా అక్కడ ప్రజల లైఫ్ స్టైల్ గురించి అదేవిధంగా అక్కడి ప్రాంత కళలు సంస్కృతి డాన్స్ ల గురించి వివరంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. 

దీనితో ఈ ప్రెస్ నోట్ చదివిన వారికి అనేక సందేహాలు కలిగాయి. వాస్తవానికి అనేక భారీ సినిమాలు విదేశాలలో షూటింగ్ లు జరుపుకున్నా ఎప్పుడు ఇలా ఆదేశ సంస్కృతి చరిత్ర జీవన విధానాల గురించి ప్రెస్ నోట్లు ఇలా విడుదల చేసిన సందర్భాలు కనిపించలేదు. సామాన్యంగా ఒక దేశానికి సంబంధించిన టూరిజమ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఆ దేశాలు ఇలా తమ దేశంలో చూడతగ్గ ప్రాంతాల గురించి యాడ్స్ ఇస్తూ ఉంటాయి.

దీనితో ‘సాహో’ మూవీ నిర్మాతలు ఇలా ఎందుకు యూరప్ లోని టూరిజమ్ ప్రాంతాలను ప్రమోట్ చేస్తూ ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు అన్న సందేహాలు చాలామందికి కలిగాయి. అయితే ఈవిషయంలో అసలు విషయం వేరు అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ లు జరుపుకునే సినిమాల నిర్మాతలకు ఆదేశ టూరిజమ్ అభివృద్ధి నిమిత్తం 50శాతం డిస్కౌంట్లు హోటల్స్ అదేవిధంగా మిగతా అన్ని విషయాలలో ఇస్తున్నట్లు సమాచారం. 

అయితే ఇలాంటి డిస్కౌంట్లు యూరప్ లోని ఆస్ట్రియా దేశం నుంచి పొందాలి అంటే అక్కడ షూట్ చేసే సినిమాల నిర్మాతలు తమ సినిమాల నిమిత్తం చేసే ప్రమోషన్ లో ఆస్ట్రియా దేశంలోని వివిధ ప్రాంతాల గురించి అదేవిధంగా టూరిస్ట్ స్పాట్స్ గురించి విరివిగా ప్రచారం చేయాలి అన్న కండిషన్ కొత్తగా పెడుతున్నట్లు టాక్. దీనితో ‘సాహో’ సినిమా ప్రమోషన్ లో ఆస్ట్రియాకు సంబంధించి అదేవిధంగా యూరప్ కు సంబంధించిన టూరిజమ్ వివరాలు కూడ ఇక చాల విరివిగా కనిపిస్తాయి అని తెలుస్తోంది. దీనితో ‘సాహో’ ప్రమోషన్ లో యూరప్ టూరిజమ్ ప్రమోషన్ కనిపించబోతోంది అంటూ కొందరు జోక్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: