పూరి జగన్నాథ్ - ఎనర్జిటికి స్టార్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం " ఇస్మార్ట్ శంకర్". పూర్తి హైదరాబాది యువకుడి కథతో తెరెకెక్కుతున్న ఈ సినిమాపై హీరో రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు రామ్ ఇటువంటి క్యారెక్టర్ చేయలేదని తెలుస్తుంది. రామ్ లుక్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ కి ఈ సినిమాతో మాస్ ఇమేజ్ వస్తుందని ఆశగా ఉన్నాడు.

 

ఇక పూరి జగన్నాథ్ కి టెంపర్ తర్వాత వరుసగా పరాజయాలని చవి చూస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లో మంచి హిట్ "టెంపర్". ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ పూర్తిగా మారిపోయింది. పూరి జగన్నాథ్ సినిమాలో ఏ హీరో అయినా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాపై పూరి కూడా చాలా ఆశలే పెట్టుకున్నాడు. పూరి అభిమానులు కూడా ఈ సినిమా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

 

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాది యాసలో రామ్ పలికిన సంభాషణలు చాలా కొత్తగా ఉన్నాయి. . ఇటీవలే ఓ పాట చిత్రీకరణతో షూటింగ్ ముగించిన టీం, పోస్ట్‌ప్రొడక్షన్స్‌ని చకచకా లాగించేస్తోందట. ఈనెల 18న ‘ఇస్మార్ట్’ థియేటర్లకు వస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్, మణిశర్మ స్వరకల్పనలో బయటికొచ్చిన పాటలు -సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. సో, సినిమా తప్పకుండా హిట్టేనన్న ఆశల్లో ఉన్నాడు హీరో రామ్.

 

ఈ సినిమాలో రామ్ సరసన  నిధి అగర్వాల్, నభా  నటేష్ నటిస్తున్నారు. హైదరాబాద్ పరిసర్ ప్రాంతాల్లో షూటింగ్ జరుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిల్లో బిజీగా ఉంది. ఇటీవల చార్మినార్ దగ్గర షూటింగ్ జరుగుతుంటే, పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాల్చాడని జరిమానా విధించిన సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం జులై 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: