శ్రుతి హాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ గారాల పట్టి. తండ్రి బహుముఖ  ప్రతిభావంతుడు. తనయ కూడా తండ్రికి తగినదే. తన టాలెంట్ తో ఆమె పలు చిత్రాల్లో నటించి  అభిమానాన్ని సంపాదించుకున్నారు. గబ్బర్ సింగ్ మూవీలో శ్రుతి ఫుల్ ట్రడిషనల్ గా కనిపించిన తీరు ఎవరూ మరచిపోలేరు. గాయనిగా, డ్యాన్సర్ గా ఇంకా ఎన్నో తనలో ఉన్నాయని చెప్పే శ్రుతి రీసెంట్ గా అభిమానులకు గుడ్ న్యూస్ ఒకటి చెప్పింది.


అదేంటి అంటే తన పెళ్ళి ఇప్పట్లో కాదు అని. నిజంగా ఏ అభిమాని అయినా ఇదే కోరుకుంటాడు కదా. కళ్ల ముందు తన ఆరాధ్య‌ దేవత అలా వెండి తెర మీద నిండు చందమామలా వెలిగిపోవాలని అనుకుంటాడు. ఇపుడు స్రుతి విషయంలో ఫ్యాన్స్ అలాగే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ శ్రుతి మూవీస్ చేస్తూ వీర విహారం చేస్తుందని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.


ఇదిలా ఉండగా, బాయ్‌ఫ్రెండ్‌ మైకేల్‌ కోర్సేల్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ వచ్చిన శృతిహాసన్‌ హఠాత్తుగా బ్రేక్‌అప్‌ చెప్పేసి ప్రేమను తెగదెంపులు చేసుకుంది. ఓ వైపు ఇది ఆమె మనసును గాయపరిచినా మరో వైపు లాభకరంగా మారింది. ఒకటిన్నర ఏడాదికి పైగా నటించకుండా ఉన్న ఆమె ప్రస్తుతం రెండు చిత్రాలలో నటిస్తున్నారు.  ఇది ఇపుడు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అయితే రేసులో ఉన్న నటీ మణులకు మాత్రం షాకింగే. శ్రుతి మళ్ళీ సీన్ లోకి వస్తే ఎవరి అవకాశాలు జారిపోతాయోనని కంగారు పట్టుకుంటోందట.



మరింత సమాచారం తెలుసుకోండి: