సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అయన కెరీర్ లో 25వ సినిమాగా ఇటీవల విడుదలైన మహర్షి సినిమా పెద్ద హిట్ సాధించి అయన కెరీర్లోనే ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టడం జరిగిందని, అయితే ఒకటి రెండు చోట్ల కేవలం బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా మాత్రమే చేరుకుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

ఇకపోతే ఇప్పటికె 50 రోజులు 210 సెంటర్లలో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇంకా అక్కడడక్కడ కొన్ని సెంటర్లలో మంచి కలెక్షన్ లతో ముందుకు సాగుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని అన్ని వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా నిన్న రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం జరిగింది. నిజానికి ఈ సినిమా జులై 2 అర్ధ రాత్రి నుండి ప్రైమ్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందని అమెజాన్ సంస్థ కొద్దిరోజుల క్రితమే ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక అప్పటినుండి సినిమాని ఎప్పుడు చూద్దామా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఇకపోతే నిన్న రాత్రి నుండి ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాని ఇప్పటికే వేలాది మంది వీక్షించించారని, ఇక ప్రైమ్ లో ఇప్పటివరకు విడుదల చేసిన సినిమాల్లో మహర్షి కూడా అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి మొదటిరోజు యావరేజ్ గా ప్రాంరంభమయిన మహర్షి జర్నీ, మెల్లగా ప్రేక్షాభిమానంతో ఎపిక్ బ్లాక్ బస్టర్ రేంజికి చేరుకుంది. ఇక మొన్నటివరకు కలెక్షనలో దుమ్మురేపిన మహర్షి, నేడు వెబ్ లో కూడా తన హవాను కొనసాగిస్తోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: