చిరంజీవి స్థాయితో పోల్చుకుంటే అనుష్క స్థాయి చాల తక్కువ. అయితే ఆమె ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిన నేపధ్యంలో ‘సైరా’ కు పరోక్షంగా అనుష్క ఇమేజ్ సహాయపడుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘సైరా’ లో అనుష్క ఒక అతిథి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. 

అయితే ఆమె ఈమూవీలో నటిస్తున్న పాత్ర స్వభావం గురించి ఇప్పుడు ‘సైరా’ యూనిట్ నుండి లీకులు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ అనుష్క వాయస్ ఓవర్ తో మొదలై ప్రేక్షకులను ప్రధమ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోకి తీసుకువెళ్ళిపోతుంది. 

ఈమూవీలో అనుష్క ఝాన్సీలక్ష్మీబాయ్ పాత్రలో కనిపిస్తూ 1857 ప్రధమ స్వాతంత్ర పోరాటానికి రంగం సిద్ధం చేస్తూ తన సైనికులకు స్పూర్తిని కలిగించే విధంగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను వినిపిస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి ప్రేక్షకులను తీసుకువెళ్ళి ‘సైరా’ కథలోకి తీసుకువెళ్ళిపోతుందని సమాచారం. దీనితో అనుష్క ఈమూవీలో కనిపించే ఝాన్సీలక్ష్మి పాత్ర ఈసినిమాకు అత్యంత కీలకం అని అంటున్నారు. 

ఈమూవీలో అనుష్క ప్రత్యేక పాత్రను పోషిస్తోంది అని తెలియగానే ఈమూవీ కన్నడ రైట్స్ ఏకంగా 30 కోట్లకు అమ్మకం జరగడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడ అనుష్క మ్యానియా సుపరిచితం కావడంతో ‘సైరా’ క్రేజ్ కు అనుష్క మ్యానియా అన్నివిధాల సహకరిస్తోంది అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తి కథనాన్ని ప్రచురించింది..    



మరింత సమాచారం తెలుసుకోండి: