యంగ్ టైగర్ ఎన్టీయార్ కెరీర్లో ఒక ఇండస్ట్రీ హిట్, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఆ ఒక్క ఇండస్ట్రీ హిట్టు 2003 సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది. ఆ తరువాత ఎన్టీయార్ ఆ రేంజ్ హిట్టు మాత్రం కొట్టలేకపోయాడు. మిగతా హీరోలు మాత్రం ఇప్పటికే 2, 3 ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. సింహాద్రి తరువాత రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమాలో ఎన్టీయార్ నటించినా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్టు కాలేదు. 
 
మిగతా హీరోలు మాత్రం ఈ విషయంలో ఎన్టీయార్ కంటే ముందే ఉన్నారు. మహేశ్ బాబు కెరీర్లో పోకిరి, శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. పవన్ కల్యాణ్ కెరీర్లో కూడా ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికిదారేది లాంటి సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్లు అందుకొన్నాడు. రామ్ చరణ్ కెరీర్లో కూడా మగధీర, రంగస్థలం లాంటి రెండు ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. 
 
అల్లు అర్జున్ కూడా ఇంకా ఇండస్ట్రీ హిట్టు కొట్టాల్సి ఉంది. ఎన్టీయార్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎన్టీయార్ ఇండస్ట్రీ హిట్టు కొడతాడని ఎన్టీయార్ అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ ఇండస్ట్రీ హిట్టైనా అందులో క్రెడిట్ రామ్ చరణ్ కు కూడా ఉంటుంది. మరి సోలోగా ఎన్టీయార్ సింహాద్రి రేంజ్ హిట్టు కొట్టడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: