టాలీవుడ్ ఇండస్ట్రీలో తీసిన నాలుగు సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు అందుకని బ్లాక్ బస్టర్ మరియు అపజయం లేని డైరెక్టర్ అయ్యాడు కొరటాల శివ. చివరిగా కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ‘భరత్ అనే నేను’ విడుదలయి దాదాపు ఏడాది కావస్తున్నా క్రమంలో చిరంజీవి తో చేయబోయే సినిమా ఇంకా ప్రారంభం కాని క్రమంలో కొరటాల అభిమానులు చిరంజీవి తో చేయబోయే సినిమా కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


అయితే ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న క్రమంలో ఈ సినిమాలో చిరంజీవి బాగా లావుగా ఉన్న నేపథ్యంలో కొరటాల శివ సినిమా కోసం లావు తగ్గడానికి ఇంకా నాకు టైం కావాలని క్యారెక్టర్ కు తగ్గ విధంగా బాడీ మార్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని కొరటాల ని చిరంజీవి ఇటీవల కోరినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. 


ఇదే క్రమంలో చిరంజీవి తో చేయబోయే సినిమా కమర్షియల్ ప్లస్ మెసేజ్ ఓరియెంటెడ్. సైరా లుక్స్ సెట్ కావు. కొంత స్లిమ్ అవ్వాల్సి ఉంటుంది. రెండు షేడ్స్ కాబట్టి తేడా చూపించాలి అంటే ఫిజిక్ పరంగా మార్పులు తప్పనిసరి. దీంతో చిరంజీవి కోరిన విధంగానే కొరటాల వెయిట్ చేయడానికి రెడీ అయ్యారట. మరోపక్క చిరంజీవి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పర్సనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో బరువు తగ్గే వర్కౌట్స్ మొదలుపెట్టినట్లు ఇండస్ట్రీ టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: