అదేంటీ తెలుగు లో బిగ్ బాస్ 3 ఇంకా మొదలే కాలేదు..అప్పుడే కంటెస్టెంట్ అరెస్ట్ కి రంగం సిద్దం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అబ్బే అది ఇక్కడ కాదు. కోలీవుడ్ లో కమల్ హాసన్ హూస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 3.  ప్రముఖ నటుడు విజయ్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే.  ఆయన కూతురు ‘దేవి’ ఫేమ్ వనితకు గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.  ఇటీవల తన ఇంటిని కూతురు బలవంతంగా లాక్కుందని వనితపై కేసు పెట్టారు విజయ్ కుమార్.

ఈ కేసు విషయం ఇంకా తేలక ముందే ఆమెపో మరో కేసు ఫైల్ అయ్యింది. భర్త నుండి విడిపోయిన తరువాత కూతురి విషయంలో అతడితో గొడవ పడుతున్నారు. 2007 లో ఆనంద్ రాజ్ ను వివాహం చేసుకున్న వనిత 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది..అయితే అప్పటి నుంచి ఆ పాప విషయంలో ఇద్దరికీ గొడవ నడుస్తూనే ఉంది.  ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా కొనసాగుతున్న వనితపై ఆమె భర్త ఫిర్యాదు మేరకు  వనితను అరెస్ట్ చేయడానికి తెలంగాణా పోలీసులు చెన్నైకి చేరుకున్నారు. 

ఈ సంవత్సరం  ఫిబ్రవరిలో వనిత తన కూతురిని చెన్నై తీసుకెళ్లి దాచిపెట్టినట్లుగా ఆనంద్ రాజ్ తెలంగాణా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వనితపై కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు అరెస్ట్ కి రంగం సిద్ధం చేశారు.  ఈ నేపథ్యంలో నజ్రత్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించిన తెలంగాణా పోలీసులు వనిత అరెస్ట్ కు సహకరించాల్సిందిగా కోరారు. ఈ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందించనుంది..వనితను తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: