హిందూ సంప్రదాయ వ్యవస్థలో కుటుంబానికి ఉండే గౌరవం అంతా ఇంతా కాదు.. కానీ రోజురోజుకూ ఆ కుటుంబ విలువల ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఎంత ఆధునిక యుగంలోకి వెళ్లినా.. ఇంకా కాస్తాకూస్తో ఇలా ఉన్నామంటే అది భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పదనమే అనేవారు ఉన్నారు.


కానీ పెళ్లి కాకుండా తల్లి అయిన ఓ హీరోయిన్ ఇప్పుడు సగర్వంగా ఆ విషయాన్ని ప్రకటిస్తోంది. దేవ్‌ డీ’ఫేమ్ హీరోయిన్‌ మహీ గిల్‌ తనకు మూడేళ్ల కూతురు ఉందని ప్రకటించి కలకలం రేపింది. ఎందుకంటే ఈ అమ్మడికి ఇంకా పెళ్లి కాలేదు మరి.


అదే విషయం అడిగితే.. ఒక బిడ్డగా తల్లిగా ఉండటం ఎంతో గర్వంగా ఉంది. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటాను... అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాదు.. పెళ్లి లేకపోయినా పిల్లలు, కుటుంబాన్ని కలిగి ఉండవచ్చంటూ కొత్త థియరీ వినిపించింది.


పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది పర్సనల్‌ చాయిస్‌ అంటున్న ఈ అమ్మడి అభిప్రాయాలనూ కాదనలేం.. ఆమె ఇష్టం.. ఆమె జీవితం.. బరితెగించింది అనడానికి మనం ఎవరం.. ఏమంటారు..?


మరింత సమాచారం తెలుసుకోండి: