ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలయికలో రూపొందుతున్న సరికొత్త చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు పాటలు సినిమాపై అంచనాలు బాగా పెంచాయనే చెప్పాలి. ఇందులో రామ్ పక్కా మాస్ లుక్ లో కనపడుతుండగా పూరి మార్క్ హీరోయిజం సినిమాలో హైలైట్ కానుందని టాక్. ఇకపోతే గత కొద్దిరోజులుగా అటు పూరికి కానీ, 

ఇటు హీరో రామ్ కి కాని సరైన హిట్ లేకపోవడంతో ఆ ఇద్దరు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. నిజానికి పూరి తనకు కథ చెప్పినప్పుడే ఈ సినిమా రేపు విడుదల తరువాత సూపర్ హిట్ అవుతుందని రామ్ భావించారట, ఇక ఈ విషయమై రామ్ తన సన్నిహితులతో మాట్లాడుతూ, తప్పకుండా ఇస్మార్ట్ శంకర్ నాకు మరియు పూరి గారికి మంచి బ్రేక్ ని ఇచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పాడట. అయితే ఈ వార్త ఇప్పటివరకు ఎక్కడా కూడా బయటకు రానప్పటికీ రామ్ సన్నిహితులు కొందరు ఈ విషయాన్ని బయటకు లీక్ చేయడం జరిగిందట. 

అయితే సినిమాలో మాస్ అంశాలు ఎక్కువగా ఉండడం, అంతేకాక యూత్ కోరుకునే రొమాంటిక్ సీన్స్ అలానే అలరించే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలను బట్టి చూస్తుంటే, ఒకవేళ అన్ని అనుకున్న విధంగా జరిగి, రేపు విడుదల తరువాత ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ కొడితే మాత్రం అటు పూరి ఫ్యాన్స్, ఇటు రామ్ ఫ్యాన్స్ ఇద్దరూ కూడా ఖుషి అయినట్లే. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ ఈనెల 18వరకు వేచి చూడాల్సిందే.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: