సినీరంగంలో హీరోయిన్ అంటే జనంలో ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. అందుకే అందమైన అమ్మాయిలంతా హీరోయిన్ కావాలని కలలు కంటుంటారు. ఒక్క ఛాన్స్ అంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు.


అలా హీరోయిన్ అయిన లతాశ్రీ పోలీస్‌ భార్య సినిమా 100 రోజుల ఫంక్షన్‌లో జనంలో ఓ కుర్రాడిని లాగి పెట్టి కొట్టేసిందట. ఆ సినిమా ఫంక్షన్ కు చాలా మంది జనం వచ్చారట. నటీనటులు వేదికపైకి వెళ్తున్న సమయంలో ఒక పోకిరీ వెనక నుంచి వచ్చి లతా శ్రీ నడుం గిల్లేశాడట.


అంతే అదే పోకిరీ రెండోసారి మళ్లీ ముట్టుకోవడానికి వస్తుంటే చేయిపట్టుకుని తిప్పేసి, చెంప పగలగొట్టేసిందట లతాశ్రీ. ఆ పోకిరీ కూడా తక్కువ తినలేదట. గొడవకు వాళ్ల గ్యాంగ్‌ను తీసుకొచ్చాడట.


అప్పుడు హీరో నరేశ్ రియల్ హీరో అయ్యారట. ఆ పోకిరీ గ్యాంగ్ వాళ్లను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారట. ఈ తమషా సన్నివేశాన్ని ఇటీవల అలీతో సరదాగా కార్యక్రమంలో లతాశ్రీ ప్రేక్షకులతో పంచుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: