టెక్నాలజి వాడకం విస్తృతంగా పెరిగిపోయాక దాని వల్ల ప్రయోజనాలు ఎన్ని కలుగుతున్నాయో అంత కన్నా ఎక్కువ స్థాయిలో నష్టాలు జరుగుతున్నాయి . ఎలా వాడాలి అనేది ఎవరికి వారి విచక్షణకు సంబంధించినది కావడంతో నియంత్రణ ఎవరి వల్లా కావడం లేదు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం కబీర్ సింగ్.

 

ఇటీవలే విడుదలైన ఈ అర్జున్ రెడ్డి రీమేక్ రెండు వందల కోట్ల మార్కుకు దగ్గరలో ఉండి ఏకంగా సల్మాన్ ఖాన్ రికార్డులకు  పెడుతోంది. నిజానికి దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే 18 లోపు వయసు ఉన్నవాళ్ళకు నో ఎంట్రీ అన్నమాట. ఒకవేళ అనుమానం వస్తే ధియేటర్ యాజమాన్యాలకు ప్రూఫ్ అడిగే హక్కు ఉంటుంది. ఇది గుర్తించిన నార్త్ యువత దీనికి తెలివిగా ఒక ఎత్తుగడ కనుకున్నారు.

 

స్మార్ట్ ఫోన్ లో యాప్ ని ఉపయోగించి ఆధార్ కార్డులోని డేట్ అఫ్ బర్త్ ని మార్చేసి దాన్నే ప్రింట్ రూపంలో తీసుకుని ఎంట్రీ దగ్గర చూపించి దర్జాగా లోపలి వెళ్ళిపోతున్నారు. అనుమానం వచ్చినా రద్దీ లాంటి పరిమితులు చాలా పరిమితులు ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ సైతం లోతుగా ఆలోచించకుండా పంపిచేస్తున్నారు.

 

ఇది చాలదు అన్నట్టు ఆన్ లైన్ బుకింగ్ లో 18లోపే అని వార్నింగ్ వస్తున్నా టీనేజర్లు దాన్ని లెక్క చేయకుండ టికెట్లు బుక్ చెసుకుని వెళ్ళిపోతున్నారు. మల్టీ ప్లెక్సులు ఈ విషయంలో చాలా నయం. సింగల్ స్క్రీన్స్ లో ఎవరు వచ్చినా ఏ వయసు వాళ్ళు టికెట్లు కొన్నా పట్టించుకునే ఛాన్స్ ఉండదు. ఇప్పుడీ ఐడియా ఉపయోగించే నార్త్ స్టేట్స్ లో లక్షలాది నూనుగు మీసాల టీనేజర్లు కబీర్ సింగ్ చూశారట. అదండీ మన అర్జున్ రెడ్డి పవర్..


మరింత సమాచారం తెలుసుకోండి: