పూరి జగన్నాధ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ ఈ నెల 18న వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు  సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోయే థియేట్రికల్ ట్రైలర్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఎన్నడూ చూడని మాస్ అవతారంలో రామ్ ని చూసి ఫ్యాన్స్ అంచనాలు అంతకంతా పెంచేసుకుంటున్నారు.

 

తన ఉనికిని సాలిడ్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన కసితో పూరి జగన్నాధ్ దీన్ని రూపొందించినట్టుగా ఇప్పటికే టాక్ బలంగా ఉంది. అంచనాలకు తగ్గట్టే బిజినెస్ కూడా భారీగా జరుగుతోందని ట్రేడ్ టాక్. ఆంధ్ర ఏరియాకే సుమారు 10 కోట్ల దాకా డిమాండ్ ఉన్నట్టు చెబుతున్నారు. ఒక్కో ఏరియా ఫైనల్ అవుతోంది కాబట్టి క్లారిటీ రావడానికి ఇంకో రెండు మూడు రోజులు పట్టొచ్చు.

 

ఇదిలా ఉండగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఇస్మార్ట్ శంకర్ సుమారు 14 కోట్ల దాకా రాబట్టినట్టు వస్తున్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. శాటిలైట్ ప్లస్ డిజిటల్ జీ సంస్థ స్వంతం చేసుకోగా విపరీతమైన క్రేజ్ నెలకొన్న నేపథ్యంలో హిందీ డబ్బింగ్ హక్కులను రామ్ కెరీర్ లోనే అత్యధిక మొత్తానికి ఇచ్చేసినట్టు టాక్ ఉంది.

 

విడిగా ఫిగర్స్ ఏంటి అనే లీక్స్ బయటికి రాలేదు కానీ ఇది ఎలా చూసుకున్న చాలా మంచి మొత్తం. ఎలాగూ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఎంతలేదన్నా పాతిక కోట్ల దాకా ఆశించవచ్చు. ఒకవేళ నిర్మాతలు చార్మీ పూరిలు దీనికి ఇరవై కోట్ల దాకా ఖర్చు పెట్టారనుకున్నా పదిహేను కోట్ల దాకా టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా ఉంది. మొత్తానికి రిలీజ్ కు ముందే ఇస్మార్ట్ శంకర్ రచ్చ చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: