సమంత ఓ బేబీ మూవీ జులై 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  సమంత మూవీలో అద్భుతంగా నటించింది.  ఈ సినిమా బాధ్యత అంతా సమంతాపైనే ఉన్నది.  సమంత యాక్టింగ్ బాగున్నట్టు వార్తలు వచ్చాయి.  


పైగా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖులంతా సమంత నటనను మెచ్చుకోవడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది.  జులై 4 వ తేదీన యుఎస్ లో మూవీ రీలీజ్ అవుతుంది.  తెలుగులో పాటు తమిళంలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతున్నది.  మాములుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, మాములు మీడియం సినిమాలు ఉదయం షో వేస్తారు.  


స్పెషల్ షోలు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు.  కానీ, సమంత ఓ బేబీ మూవీ చెన్నైలో స్పెషల్ షోగా వేస్తున్నారు.  చెన్నైలోని జీకే సినిమాస్ లో స్పెషల్ షో వేస్తున్నారు.  స్పెషల్ షో కోసం ఇప్పటికే టిక్కెట్లు పూర్తయినట్టు తెలుస్తోంది.  


తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉన్నది.  రెండు చోట్ల సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నది యూనిట్.  జీకే సినిమాస్ లో ఉదయం 8 గంటలకు సినిమా రిలీజ్ అవుతుందట. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే జులై 5 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: