తెలుగులో తాప్సి ఝుమ్మంది నాదం సినిమా చేసింది.  ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  తెలుగులో కొన్ని సినిమాలు చేసింది.  తెలుగులో కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు పయనమైంది.  అక్కడ కొన్ని సినిమాలు చేసింది.  అక్కడ చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి.  


బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. తెలుగులో ఆనందో బ్రహ్మ, గేమ్ ఓవర్ చేసింది. ఈ రెండు సినిమాలు బెస్ట్ హిట్ కొట్టాయి.  ఇప్పుడు రాజుగారిగది 3 సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.  సౌత్ తో పాటు బాలీవుడ్ లో యమా బిజీ అయ్యింది ఈ నటి.  


ఇలా మంచి సినిమాలు చేస్తున్న తాప్సికి మరో ఛాన్స్ వచ్చింది.  ఇండియన్ క్రికెట్ విమెన్ మిథాలీరాజ్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి.  బాలీవుడ్ లోని ఓ ప్రముఖ సంస్థ ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటోంది.  


మిథాలీరాజ్ పాత్రలో తాప్సి అయితే బాగుంటుందని అనుకోవడం వలన ఈ సినిమాను తెరకెక్కించబోతున్న.  పైగా ఇప్పుడు బయోపిక్ సినిమాలు ట్రెండ్ సెట్టర్ గా మారాయి.  మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: