యెంత కూతురైతే మాత్రం, రాజశేఖర్ కి ఇది తగదని అంటున్నారు. సావిత్రి పేరును ఉత్త ‘సావిత్రి’గా ఎవ్వరూ పేర్కొనరు. ఆ పేరు ముందు ‘మహానటి’ అనేది ఇంటి పేరులా మారిపోయింది. ఆమె గురించి తెలియని వాళ్లు కూడా ఒక్క సీన్ చూస్తే చాలు ఆమె ఎంత గొప్ప నటో అర్థం చేసుకుంటారు. ఆమె పేరు మీదా ‘మహానటి’ సినిమా కూడా వచ్చింది. నటనలో సావిత్రితో పోల్చడానికి కూడా ఒక స్థాయి ఉండాలి ఏ హీరోయిన్‌కైనా.

 

సౌందర్య లాంటి దిగ్గజ స్థాయి అందుకున్న వాళ్లనే సావిత్రితో పోల్చారు. కానీ ఇప్పుడు ఇంకా అరంగేట్రం కూడా చేయని నటిని సావిత్రితో పోల్చేయడం విడ్డూరం. ఈ సాహసం రాజశేఖర్ తన చిన్న కూతురు శివాత్మిక విషయంలో చేశారు. తనకు తానుగా ఆ మాట అనకుండా.. జనాల పేరు చెప్పి తన కూతురిని సావిత్రితో పోల్చేశాడు రాజశేఖర్.

 

వాత్మిక ‘దొరసాని’ చిత్రంతో కథానాయికగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు. ఐతే టీజర్, ట్రైలర్‌లో తన కూతురిని చూసి జనాలు సావిత్రితో పోలుస్తున్నారని రాజశేఖర్ పేర్కొనడం విశేషం. శివాత్మిక లుక్స్ ఏమంత బాలేకున్నా.. ఆమె హావభావాలు పర్వాలేదనిపించాయి. ఈమాత్రానికే సావిత్రితో పోలిక పెట్టడం మరీ విడ్డూరం.

 

ఈ సంగతలా ఉంచితే.. తన పెద్ద కూతురు కథానాయికగా పరిచయం కావాల్సిన ‘2 స్టేట్స్’ రీమేక్‌కు బ్రేక్ పడినట్లు రాజశేఖరే ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఔట్ పుట్ నచ్చక దర్శకుడిని పక్కన పెట్టి.. వేరే డైరెక్టర్‌తో తీయిద్దామని చూస్తుండగా.. ఒరిజినల్ డైరెక్టర్ న్యాయపోరాటానికి దిగాడు. మొత్తానికి ఆ సినిమా మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: