టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, హీరోయిన్ దంప‌తులు అయిన జీవిత‌, రాజ‌శేఖ‌ర్ కుమార్తెలు ఇద్ద‌రూ సినిమా రంగంలోకి హీరోయిన్లుగా ప్ర‌వేశిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దొరసాని సినిమాతో శివాత్మిక‌ తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌శేఖ‌ర్ అటు తాను న‌టించిన క‌ల్కి సినిమాతో పాటు ఇటు కుమార్తె సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కూడా బిజీగా ఉన్నారు. 


శివాత్మిక దొర‌సాని సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న శివాత్మిక ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయ‌నుంది. ఈ ఇద్ద‌రికి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. టాలీవుడ్‌లో దూసుకుపోతోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ కాగా.. ఇటు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల కుమార్తే శివాత్మిక‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఆనంద్‌, శివాత్మిక ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీలో త‌మ‌కు ఇష్ట‌మైన వాళ్ల గురించి చెపుతున్నారు.


ఈ క్ర‌మంలోనే శివాత్మిక కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. త‌న‌కు హిందీలో రణ్వీర్ సింగ్, ఆదిత్య రాయ్ కపూర్, రన్బీర్ కపూర్, విక్కీ కౌశల్ అంటే ఇష్టం అని తెలిపింది. టాలీవుడ్‌లో త‌న‌కు నాని అంటే ప్రేమ అని చెప్పింది. నిజానికి ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్ల‌కు నాని అంటే ఇష్టం. ఈ క్ర‌మంలోనే శివాత్మిక కూడా నానితో ఛాన్స్ కోస‌మే అన్న‌ట్టుగా నానిపై ఎన‌లేని ప్రేమ చూపించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా శివాత్మిక కి చాలా ఇష్టం అని తెలిపింది. దొరసాని ఈ నెల 12 న విడుదల అవుతున్న సంగ‌తి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: