టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఆ మద్య ఎన్టీఆర్ హీరోగా ‘టెంపర్’ సినిమా తెరకెక్కించారు.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని ఫస్టాఫ్ ఎంత నెగిటీవ్ షేడ్ లో చూపించారో అందరికీ తెలిసిందే.  ఎన్టీఆర్ ఈ చిత్రంలో దాదాపు ఊరమాస్ డైలాగ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు.  ఈ మూవీలో క్లయిమాక్స్ లో కోర్టు సీన్లు ఆడియన్స్ గుండెల్ని పిండేసేలా తెరకెక్కించారు. టెంపర్ తర్వాత పూరి కి ఏదీ కలిసి రావడం లేదు.   దేవదాసు చిత్రంతో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ కొంత కాలంగా సరైన హిట్ లేకుండా తెగ బాధపడుతున్నాడు. 


తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరక్కుతున్న మూవీ ఇస్మార్ట్ శంకర్.  ఈ చిత్రం టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించింది.  అంతే కాదు ఈ మూవీ మొదటి నుంచి హైదరాబాద్ బస్తీ యువకుడు ఎంత రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడో కళ్లకు కట్టినట్టూ చూపించారు.  కొద్ది సేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.  తెలంగాణ యాసలో రామ్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ ఊరమాస్ లా ఉంది. ట్రైలర్ చూస్తుంటే మూవీ మొత్తం రామ్ వన్ మ్యాన్ షోలా కనిపిస్తోంది.


ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ లో రామ్ అదరగొట్టబోతున్నట్లు కనిపిస్తుంది.  ఇక హీరోయిన్స్ ఇద్దరూ గ్లామర్ షో తో రెచ్చిపోయినట్లున్నారు. ఇక డ్యాన్స్, ఫైట్స్ విషయంలో అయితే రామ్ ఇరగదీసినట్లు కనిపిస్తుంది. మొత్తానికి పూరి జగన్నాథ్ తనదైన శైలిలో రామ్ ని మాస్ లుక్ లో ప్రజెంట్ చేశాడు.  'పెద్దమ్మ గుళ్లో మొక్కి చాన్నాళ్లయింది.. నా యాట నువ్వేనని మొక్కేసినా.. నువ్వే నా పొట్టేల్' అంటూ రామ్ తెలంగాణ యాసలో డైలాగులు చెబుతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: