బాహుబలి అంతటి భారీ చిత్రం తర్వాత ప్రభాస్ సినీ కెరీర్ లో రాబోతున్న మరో ప్రతిష్టాత్మక భారీ చిత్రం 'సాహూ'. పూర్తి స్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు యువ దర్శకుడు సుజీత్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ లు ఇచ్చి అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గత నెల ఫస్ట్ లుక్ ని రివీల్ చేసాడు.


తాజాగా రంజాన్ బహుమతిగా టీజర్ రిలీజ్ చేసి అభిమానుకు ''నేనున్నాను అంటూ యాక్షన్ థ్రిల్లర్ చూపించాడు ప్రభాస్" 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ ను ఓ ఓ స్థాయికి తీసుకెళ్లనుంది. టాలీవుడ్ ని ఓ రేంజ్ తీసుకెళ్లే సినిమా సాహూ ఒకటి అయితే బుల్లితెర టిఆర్పీ రేట్లు పెంచి దేశాన్ని మొత్తం తెలుగు రాష్ట్రాల పక్క తిప్పే టీవీ షో బిగ్ బాస్ 3. ఇప్పుడీ బిగ్ బాస్  గురించి ఎందుకు అనుకుంటున్నారా అక్కడే ఉంది ట్విస్టు..


ఇప్పటికే బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాగార్జున కన్ఫర్మ్ అయ్యి ''ఈసారి నేనే రంగంలోకి దిగుతున్న అంటూ" మూడు రోజుల క్రితం మన ముందుకు నాగార్జున ప్రోమోతో వచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఇప్పుడు మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ 3 కంటస్టెంట్లు ఎవరో తెలియలేదు అనుకోండి. కాంటెస్టెంట్ లిస్ట్ ఏ ఇంకా బయటకు రాలేదు కానీ అతిధి పేరు మాత్రం బయటకు వచ్చి హాల్ చల్ చేస్తుంది.


అదేనండి మన సాహూ ప్రభాస్ బిగ్ బాస్ 3 కి రానున్నారట. బిగ్ బాస్ 3 లో కంటస్టెంట్ల కాదు అతిథిగా.. మనకు తెలిసిందే కాదండి. బిగ్ బాస్ మొదటి సీజన్ లో విజయ్ దేవరకొండ, రానా, తాప్సి రెండోవ సీజన్ లో యాంకర్ ప్రదీప్, ఇప్పుడు మూడో సీజన్ లో ప్రభాస్ రానున్నారట.. అయితే కరెక్ట్ గా సినిమా రిలీజ్ అయ్యేముందు రానున్నారట? ఎందుకో తెలుసా? సాహూ ప్రేమోషన్స్ కోసం బుల్లితెరకు ప్రభాస్ రానున్నారట.. మరి నిజంగా బుల్లితెరపై రెబల్ స్టార్ ప్రభాస్ ని చూస్తామ.. నాగార్జున పక్కన ప్రభాస్ ఈ బిగ్ బాస్ లో ఉండబోతున్నార? బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నార ? అనేది మనం బిగ్ బాస్ 3 లొనే చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: