RX 100 సినిమాతో ఒక్క‌సారిగా సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ సినిమాలో ఆమె చేసిన బోల్డ్ న‌ట‌న దెబ్బ‌తో టాలీవుడ్ యూత్ ఆమెకు ఫిదా అయిపోయారు. పాయ‌ల్ ఆ త‌ర్వాత ఏ సినిమా చేస్తుందా ? అని క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిటింగ్‌లో ఉన్నారు. పాయ‌ల్ ప్ర‌స్తుతం తెలుగులో సూపర్ ఫాం లో ఉంది. విక్టరీ వెంకటేష్ తో వెంకీమామ - మాస్ మహరాజ్ రవితేజతో డిస్కో రాజా సినిమాల్లో కూడా న‌టిస్తోంది.


ఇక ఇటీవ‌ల వ‌చ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో ఐటెం సాంగులో కూడా హాట్‌హాట్‌గా అల‌రించింది. బాలీవుడ్‌లో హాట్ సీరియ‌ల్స్ చేసుకుంటోన్న ఈ అమ్మ‌డిని RX 100 డైరెక్ట‌ర్ అజ‌య్‌భూప‌తి ఓ రేంజ్‌లో వాడేశాడు. ఆమెను ఎలా చూపించాలో అలా చూపించేశాడు. ఈ సినిమా త‌ర్వాత ఆమెకు అదే త‌ర‌హా బోల్డ్ క్యారెక్ట‌ర్ పాత్ర‌లే వ‌చ్చాయ‌ట‌. 


ఇక తాజాగా పాయ‌ల్ అరుంధ‌తి 2 సినిమాలో న‌టిస్తోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. శ్రీశంఖు చక్ర మూవీస్ బ్యానర్ లో అరుంధతి 2 ఎనౌన్స్ చేశారు నిర్మాతలు. శ్యాంప్ర‌సాద్ రెడ్డి నిర్మాత‌గా కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అన‌గానే మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 


అరుంధ‌తి లాంటి క్యారెక్ట‌ర్‌లో పాయ‌ల్ ఏంట్రా అని చాలా మంది షాక్ అయ్యారు. ఇంత‌కు ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ గురించి పాయ‌ల్‌తో మాట్టాడిన నిర్మాత‌లు ఆమె హీరోయిన్‌గా చేస్తుంద‌న్న ప్ర‌చారం చేయ‌డంతో నిర్మాత‌ల‌పై ఆమె ఫైర్ అయ్యింద‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అది అస‌లు సంగ‌తి.



మరింత సమాచారం తెలుసుకోండి: