సోలో డేట్ కోసం తెలుగులో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలను కూడా అలానే ఉంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలు రెడీ చేసుకుని, సోలో డేట్ కోసం చూస్తూ వెనక్కు, వెనక్కు నడస్తూ ఆఖరికి ఏదో డేట్ కు విడుదల చేసాం అనిపించుకుంటున్నారు. అప్పటికే పుణ్య కాలం కాస్తా గడిచిపోయి ప్రేక్షకులకు మొహం మొత్తేస్తుంది.
లేటెస్ట్ గా రెండు సినిమాల పరిస్థితి అలాగే వుంది. తనకంటు ఒక ఇమేజ్ ఉన్న శర్వానంద్ కూడా సోలో డేట్ కోసం చూస్తున్నారు. సుధీర్ వర్మ డైరక్షన్ లో శర్వానంద్ చేసిన రణరంగం సినిమా ఇంకా విడుదల డేట్ విషయంలో క్లారిటి రాలేదు. ఇప్పటికే రెండు మూడు డేట్ లు మారిన ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

కానీ బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా పరిస్థితి ఇంకా దారుణంగా వుంది. ఎక్కడన్నా సోలో డేట్ దొరుకుతుందా అని వెనక్కి వెనక్కి వెళ్తున్నారు. ఆఖరికి తమ డేట్ మీద పూరి-రామ్ సినిమా వస్తే వెనక్కు జరిగారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆగస్టు 2న ఫిక్స్ అయ్యారు. అయితే అక్కడ శర్వా సినిమా వుందనే విషయం తెలుసో లేదో మరి.ఇక ఈ విషయంలో ఈ రెండు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు దగ్గర పంచాయతీ నడుస్తోందని సమాచారం. ఈ రెండింటిలో ఏదో ఒక సినిమాను సెప్టెంబర్ 13కు జరపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. 

కానీ శర్వానంద్ సినిమా వెనక్కు వెళ్తే, బెల్లంకొండ సినిమాకు భయపడి వెనక్కు వెళ్లారు అంటారు. అందుకే శర్వా ఆగస్టు 2నే రావాలని అనుకుంటున్నట్లు లేటెస్ట్ న్యూస్.
అయితే ఆగస్టు 2 కు వారం వెనుకగా మన్మథుడు 2, ఆ తరువాత వారం సాహో విడుదల వున్నాయి. 2న వచ్చే సినిమాలు అద్భుతం అంటే తప్ప నెక్స్ట్ వీక్ కి థియేటర్లలో మిగలవు. మరి ఇంతకీ సెప్టెంబర్ కు ఎవరు వెళ్తారో? ఆగస్టు 2కు ఎవరు వుంటారో తేలాల్సివుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: