ఇద్దరు దర్శకులు... ఇద్దరికీ రెండో సినిమానే..ఇక అనుకోకుండా వాళ్ళిద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. రిజల్ట్ మాత్రం ఇద్దరు ఊహించలేదు..అందుకే వేర్వేరుగా వచ్చాయి. ఆ రెండు సినిమాలే డాక్టర్ రాజశేఖర్ నటించిన కల్కి, శ్రీ విష్ణు-నివేదా థామస్ నటించిన బ్రోచేవారెవరురా. ఇక ఆ ఇద్దరు దర్శకులు ప్రశాంత్ వర్మ, వివేక్ ఆత్రేయ. 
మెంటల్ మదిలో సినిమాతో సెన్సిబుల్ డైరక్టర్ అనిపించుకున్నాడు వివేక్ ఆత్రేయ. ఆ సినిమా యూతందరికీ విపరీతంగా నచ్చింది. దీంతో తన రెండో సినిమాకు కూడా అదే స్టైల్‌ని ఫాలో అయ్యాడు. 

మొదటి ప్రయత్నంగా కంప్లీట్ లవ్ సబ్జెక్ట్ ఎంచుకున్న ఈ దర్శకుడు.. బ్రోచేవారెవరురా సినిమాకు క్రైమ్, కామెడీ కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. ఈ సారీ కూడా సక్సెస్ కొట్టాడు.
ఇక మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇతడు మొదటి సినిమాతోనే ప్రయోగాల బాటపట్టాడు. "అ!" అనే స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాతో ఆకట్టుకున్నాడు. అది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన రెండో సినిమాను కూడా ఈ దర్శకుడు ప్రయోగాత్మకంగా తీసి ఉంటే బాగుండేదేమోనని ప్రస్తుతం కొందరు అభిప్రాయపడుతున్నారు.

కానీ అలా కాకుండా కల్కి లాంటి సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. దానికి కమర్షియల్ హంగులను జోడించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు టెక్నికల్ అంశాలపై కూడా ఎక్కువగా దృష్టిపెట్టాడు. దీంతో ఈ సినిమా యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. ఇలా ఒకేరోజు అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇద్దరు దర్శకుల్లో ఒకరు సూపర్ హిట్ కొడితే, మరొకరు మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది మన ఇండస్ట్రీలో కామన్ అయినప్పటికి బాగా పేరున్న డైరెక్టర్స్‌కే ఒక ఫ్లాప్ పడితే మళ్ళి సినిమా అవకాశం రావడానికి చాలా టైం పడుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఇలా ఇప్పుడిప్పుడే సక్సస్ దారి వెతుక్కుంటున్న ఈ యంగ్ డైరెక్టర్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: