సమంత - నందిని రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఓ బేబీ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాలన్నిటిలో ఓ బేబీ సినిమాపైనే అందరి ఆసక్తి ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే.. సమంత ఆ రేంజ్ లో ఓ బేబీ ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంది. సమంత చేసే సందడితో ఓ బేబీ మీద ప్రేక్షకుల్లో రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. కొరియన్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ ఓ బేబీ సినిమాకి బడ్జెట్ గా ఆరు కోట్ల బడ్జెట్ పెట్టినట్లుగా సమాచారం. అయితే ఈ మూవీ రీమేక్ రైట్స్ కి దాదాపుగా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు 10 కోట్లు చెల్లించి హక్కులు కొన్నారట. దాంతో మూవీకి ఖర్చు మొత్తం బడ్జెట్ 16 కోట్లు అయ్యిందని క్లియర్‌గా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కోసం సమంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుందనే టాక్ ఒకటి ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అందుకు ముఖ్య కారణం మజిలీ సూపర్ హిట్టవడమే. ఇక సమంత తనకు బంధువైనప్పటికి ..రెమ్యునేషన్ విషయంలో సురేష్ బాబు ఎక్కడా రాజీ పడలేదని.... సమంత కు దాదాపుగా రెండు కోట్లు రెమ్యునిరేషన్ ఇచ్చారని ఫిలింనగర్ టాక్. మరి ఆ రేంజ్ పారితోషకం అందుకోబట్టే సమంత అన్ని తానై ఆ సినిమా ప్రమోషన్స్ చేస్తుందని... కూడా గుసగుసలు వినబడుతున్నాయి. 

ఎన్నడూ లేని విధంగా సమంత ఓ బేబీ ప్రమోషన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తనకు సొంత సినిమాగానే భావించడం విశేషం. మరి ఓ బేబీ మీద సమంతకి ఎంత నమ్మకం లేకపోతే... ఆ సినిమాని తెచ్చి నందినిరెడ్డిని డైరెక్ట్ చెయ్యమంటుంది చెప్పండి. సమంత చెప్పడం వల్లనే ఓ బేబీ మూవీ పట్టాలెక్కినట్లుగా దర్శకురాలు నందిని రెడ్డి రీసెంట్‌గా చెప్పడం మరో ఆసక్తికరమైన విషయం.  



మరింత సమాచారం తెలుసుకోండి: