మా టీవీలో బిగ్ బాస్ 3 సీజన్ కు డేట్ ఫిక్స్ అయింది. జులై 21 నుంచి బిగ్ బాస్ హడావుడి స్టార్ట్ అవుతుందని లేటెస్ట్ అప్‌డేట్. ఇప్పటికి నలభైమంది వరకు హౌస్ మేట్స్ ను ఎంపిక చేసి వుంచారట.  అయితే వీళ్ళలో నుంచి 14 మందిని ఫైనల్ చేయాల్సి వుంది. ఈ వారం ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున ఈ సీజన్ కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

యాంకర్ శ్రీముఖి మాత్రం ఫైనల్ లిస్ట్ లో ఇప్పటికే చేరిపోయినట్లు తెలుస్తోంది. బయట ప్రచారంలో వున్నట్లు ఉప్పల్ బాలు (టిక్ టాక్), హేమచంద్ర పేర్లు అస్సలు పరిశీలనలోనే లేవని మరో న్యూస్. మీలో ఎవరు కోటీశ్వరుడులో మాదిరిగా ప్రతివారం ఓ సినిమా సెలబ్రిటీని షోకు తీసుకురావడం ద్వారా బిగ్ బాస్ 3ని పాపులర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రతివారం విడుదలయ్యే సినిమాలకు చెందిన సెలబ్రిటీస్‌ని, అలాగే ప్రత్యేక అతిథులను షోకు తీసుకువచ్చి, వ్యూవర్ షిప్ పెంచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హడావుడి 100 రోజుల పాటు వుంటుంది. అంటే దాదాపు నవంబర్ ఆఖరు వరకు బిగ్ బాస్ 3 ప్రసారం వుంటుందన్నమాట. మొత్తానికి రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడిపోయిందని ఈ అప్‌డేట్ చూస్తే అర్థమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: