ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి నెలలు గడిచిపోతున్నా కలలో కూడ ఊహించని పరాభవాన్ని ఎదుర్కున్న పవన్ కళ్యాణ్ ఆ షాక్ నుండి ఇంకా పూర్తిగా తెరుకోలేకపోతున్నాడు. వాస్తవానికి జయాపజయాలతో ఎటువంటి సంబంధం లేకుండా తాను 20 సంవత్సరాలు రాజకీయాలలో కొనసాగుతాను అని అంటున్నప్పటికీ ‘జనసేన’ కు ఏర్పడ్డ నిధుల కొరత తీవ్రంగా పవన్ ను కలిచి వేస్తున్నట్లు టాక్. 

ప్రస్తుత పరిస్థుతులలో ఒక రాజకీయ పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికల దాక బ్రతకాలి అంటే నిధులు కావాలి. అలాంటి పరిస్థితి ‘జనసేన’ కు కూడ ఎదురు కావడంతో నిధుల సమీకరణ విషయమై ‘జనసేన’ తన దృష్టి పెట్టింది అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆపార్టీ అనుసరిస్తున్న వ్యూహాల పై మొదట్లోనే సెటైర్లు పడటం హాట్ టాపిక్ గా మారింది.

‘జనసేన’ అనుబంధ విభాగం శతఘ్ని టీమ్ ఈమధ్య ఒక పోస్టింగ్ పెట్టింది. ‘100 రూపాయలు జనగణ మన అని జపించి జనసేన ఖాతాలో జమ చేద్దాం. మన భవిష్యత్ మనమే బలపరుచుకుందాం’ అంటూ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో జనసేన పార్టీ మనగడ కోసం నిధులు అడగడంలో తప్పు లేకపోయినా ప్రాస కోసం జాతీయ గీతం జనగణ మన ను ఎందుకు కలిపారు అంటూ కొందరు అప్పుడే సెటైర్లు మొదలు పెట్టేసారు. 

మరికొందరైతే నిధుల లేమితో బాథ పడుతున్న జనసేన పరిస్థితిని విస్మరించి పవన్ ప్రత్యేక విమానాలలో ఎందుకు తిరిగాడు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరి కొందరైతే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అంతా వేల కోట్ల స్థాయిలో ధనవంతులు అయిన నేపధ్యంలో పవన్ ‘జనసేన’ కు నిధులు కొరత ఏమిటి అంటూ షాక్ అవుతున్నారు. ఈ కామెంట్స్ ఇలా కొనసాగుతూ ఉంటే పవన్ తానా మహాసభల కోసం అమెరికా వెళ్ళిన నేపధ్యంలో అక్కడ ‘జనసేన’ కోసం భారీ విరాళాలు అడగకుండా ఇక్కడ పవన్ అభిమానులు ఎన్ని సార్లు జనగణ మన జపించి 100ల రూపాయలు వేసినా ఎప్పటికి కోటి రూపాయలు అవుతుంది అంటూ పవన్ తన పార్టీకి విరాళాలు సేకరించే విషయంలో కూడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: