హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎప్పుడు పోతాయో తెలియదు.  ఆయా సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు.  కానీ, సమంత ఓ బేబీ సినిమాకు మాత్రం భారీ ప్రచారం జరుగుతున్నది.  సినిమాపై అంచనాలు పెంచుతున్నది.  


జులై 5 వ తేదీన సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.  అటు చెన్నైలో ఈ మూవీని జీకే సినిమాస్ లో మార్నింగ్ స్పెషల్ షో వేసేందుకు అనుమతి లభించింది.  లేడీ ఓరియంటెడ్ సినిమాకు ఇలా అవకాశం రావడం ఇదే మొదటిసారి.  చెన్నైలో థియేటర్ దగ్గర సందడి అప్పుడే మొదలైంది. 


ఇటు హైదరాబాద్ లోను సందడి మొదలైంది.  హైదరాబాద్ లోని దేవి థియేటర్లో సమంత ఓ బేబీ కి సంబంధించిన పెద్ద కటౌట్ ను ఏర్పాటు చేశారు.  ఆ కటౌట్ చూసి అందరు షాక్ అవుతున్నారు.  పెద్ద హీరోల సినిమాలకు పెట్టె విధంగా కటౌట్ ను ఏర్పాటు చేయడం విశేషం.  


ఈ కటౌట్ ను చూసి సమంత సైతం షాక్ అయ్యిందట.  పెద్ద హీరోలకు ఇచ్చిన గౌరవం తన సినిమాకు ఇవ్వడంతో ఆమె ఫిదా అవుతున్నట్టు తెలుస్తోంది.  పెద్ద హీరోల సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు.  ఇప్పుడు ఇదే బాటలో సమంత కూడా నడవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: