‘సైరా’ మూవీ విషయంలో పేరుకు నిర్మాతగా చరణ్ ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయం చిరంజీవి అదుపులోనే కొనసాగుతున్నాయి. ఈమూవీకి అనుకున్న స్థాయికన్నా విపరీతమైన బడ్జెట్ అవ్వడంతో పాటు ఈమూవీకి దర్శకత్వం వహించే సురేంద్ర రెడ్డికి చారిత్రక సినిమాల అనుభవం లేకపోవడంతో చిరంజీవి తన వయసును కూడ పక్కకు పెట్టి ఈమూవీ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఎడిటింగ్ పై శ్రద్ధ పెట్టిన చిరంజీవి ఈ సినిమాలోని ఒక సన్నివేశానికి సంబంధించి ఎడిట్ చేసిన కామెంట్స్ ఈమూవీ యూనిట్ ను ఆశ్చర్య పరిచినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ‘సైరా’ లో ఒక జానపద బాణితో ఉండే ఒక పాట ఉన్నట్లు టాక్. ఈపాటలో చిరంజీవి చేత మాస్ స్టెప్స్ వేయించారట. 

అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ పాటకు సంబంధించిన రషస్ చూసినప్పుడు చిరంజీవికి ఒక సందేహం కలిగినట్లు టాక్. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాకుండా ఆకథ 18వ శతాబ్దానికి చెందింది కావడంతో ఆ పాటలో ఇలాంటి మాస్ స్టెప్స్ ఏమిటి అంటూ ఆ పాటలోని తన స్టెప్స్ కు సంబంధించిన సీన్స్ ను తానే చిరంజీవి స్వయంగా ఎడిట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.   

దీనితో ఈసినిమాలోని ప్రతి సీన్ ఎడిటింగ్ విషయంలో చిరంజీవి తీసుకుంటున్న జాగ్రత్తలు బయట పడుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ విషయంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని ఉరి తీసే సన్నివేసం యధాతధంగా ఉంచమని ఆ సీన్ కు బదులు  ఆ విషయానికి సంబంధించి వాయస్ ఓవర్లు పెట్టి ఈమూవీలోని అత్యంత కీలకమైన భావోద్వేగాన్ని చెడగొట్టవద్దు అంటూ చిరంజీవి స్పష్టమైన సూచనలు సురేంద్ర రెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మహాత్మా గాంధీ 150వ జయంతి దేశ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో జరగబోతున్న నేపధ్యంలో ఆ సందర్భాన్ని కూడ చాల తెలివిగా ‘సైరా’ పబ్లిసిటీలో ఉపయోగించుకునే విధంగా చిరంజీవి ఆలోచనలు ఉన్నాయి అని తెలుస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: