రాజకీయాల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయకుడు జగన్. జగన్ గెలుపు చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. టిడిపి ఇంత ఘోరమైన ఓటమి చవి చూస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. దేశ రాజకీయాల్లో తన విజయంతో ప్రభంజనం సృష్టీంచాడు వై యస్ జగన్.దేశమంతా జగన్ వైపు చూసి శభాష్ అనేసింది.కానీ టాలివుడ్ కి మాత్రం ఏమైంది ? ఏపీ ఎన్న్నికల వార్ లో దేశ0 మొత్తాన్ని ఆకర్షించాడు జగన్.

 

జగన్ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాటిపోయింది.   కానీ ఇప్పటికి టాలివుడ్ పెద్దలు అభినందించలేదు. మా అసోసియేషన్ గాని, నిర్మాతల మండలి గానీ, తెలుగు ఫిలిం ఛాంబర్ గానీ ఎవ్వరూ జగన్ ను కలవలేదు.  దీంతో జగన్ ను సిఎంగా గుర్తించడానికి ఇష్టపడడం లేదా ? అనే చర్చ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా, రాజకీయ నాయకుల్లోనూ జోరుగా సాగుతోంది.

 

గతేడాది టిఆర్ఎస్ ఘనవిజయం సాధించిన తరువాత కేసిఆర్ ను టాలివుడ్ పెద్దలంతా వెళ్లి అభినందించారు. చిత్ర పరిశ్రమకు సబంధించిన సమస్యలు చెప్పుకొని పరిష్కరించమని కోరారు. 2014 లో ఏపీ సిఎం గా ఎన్నికైన చంద్రబాబును కూడా టాలివుడ్ ఆయనను కలిసి అభినందించింది. కానీ జగన్ దగ్గరకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది చిత్ర పరిశ్రమ నుంచి ఎవ్వరూ ఇప్పటి దాక కలవలేదు.

 

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ని సపోర్టు చేస్తూ పోసాని క్రిష్ణ మురళి, పృథ్వీ లాంటి వాళ్ళు టిడిపై విమర్శలు చేసారు.  వాళ్ళే తప్ప జగన్ గెలిచాక అభినందించిన వాళ్ళు కనబడలేదు. దీనికి కారణం ఏంటనేది తెలియదు. కొద్ది రోజుల క్రితం నిర్మాత్ సురేష్ బాబు ఏపీలో స్టూడియోల నిర్మాణం గురించి మాట్లాడాడు. జగన్ రమ్మంటే మేమందరం నిర్మించడానికి రెడీ ఉన్నాం అన్నాడు. అయితే ఇంకెవరూ ఈ విషయంపై పెదవి విప్పలేదు.దీంతో జగన్ ను ఏపీ సిఎం గా టాలివుడ్ గుర్తించలేదా అనే దిస్కర్షన్ పొలిటికల్ సర్కిల్లో మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: