సెలెబ్రెటీలను ఆరాధించడమే కాదు ఆ సెలెబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తమ సొంత విషయాలకు మించి పట్టించుకుంటూ ఆవిషయాల పై అభిమానులు మీడియా చేసే హడావిడి శృతిమించి పోతోంది అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. దీనికి పరాకాష్టగా కొద్ది రోజుల క్రితం సమంత తిరుపతి వెళ్ళినప్పుడు అభిమానులు మీడియా సృష్టించిన హంగామాతో పాటు ఆమె మంగళ సూత్రాన్ని కూడ వదలకుండా యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చేసిన హడావిడి పై ఇప్పుడు అనేక కామెంట్స్ వస్తున్నాయి. 

సమంత ‘ఓ బేబి’ సక్సస్ కోసం శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రార్ధించడానికి తిరుపతి వచ్చిన సందర్భాన్ని పసిగట్టిన అభిమానులు మీడియా కెమెరాలు ఆమె తిరుపతిలో ఉన్న గెస్ట్ హౌస్ నుండి ఆమె ఏడుకొండలు మెట్లు ఎక్కే వరకు ఆమెను వెంటాడుతూనే ఉన్నారు. వాస్తవానికి సమంత సున్నితంగా తనను వదిలిపెట్టండి అని అడిగినా ఎవరు పట్టించుకోలేదు. 

ఈ హడావిడి నేపధ్యంలో సమంత తన మంగళ సూత్రాన్ని తన మేడలో సద్దుకున్న సందర్భానికి సంబంధించిన ఫోటోలను కూడ తీసి యూట్యూబ్ లో పెట్టి ‘సమంత మంగళ సూత్రంతో ఏమి చేసిందో తెలుసా’ అంటూ కొందరు వీడియోలు పెడుతూ జనం చేత ఆ వీడియోలకు హిట్స్ కొట్టించుకుంటున్న నేపధ్యంలో ఆ మీడియా సంస్థల పని తీరు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఈ విషయాలన్నీ రోజురోజుకు దిగజారుతున్న నైతిక విలువలకు సంకేతం అంటూ కొందరు కామెంట్స్ కూడ చేస్తున్నారు. 

సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితం పై ఆసక్తి ఉండటం సర్వసాధారణమే అయినా ఇప్పుడు ప్రస్తుత తరం యూత్ కు ఈ ఆసక్తి హద్దులు దాటిపోతున్న నేపధ్యంలో ఇలాంటి వికృత వీడియోలు వికృత న్యూస్ లు పుట్టుకు వస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమంత సినిమాలు సమంత ఫోటో షూట్స్ మాత్రమే కాదు సమంత మంగళ సూత్రం కూడ హాట్ న్యూస్ గా మారడం అత్యంత ఆసక్తిదాయకం..


మరింత సమాచారం తెలుసుకోండి: