ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల తీసిన ‘హ్యాపీడేస్’మూవీలో హీరోగా నటించారు నిఖిల్.  అంతకు ముందు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన నిఖిల్ కి హ్యాపీడేస్ మంచి ఫ్లాట్ ఫామ్ అయ్యింది.  వెంటనే రెండుమూడు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.  ఇక కెరీర్ డేంజర్ లో పడుతుందన్న సమయంలో కార్తికేయ,ఎక్కడికి పోతావు చిన్నవాడ,కేశవ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు.  హీరోగా మంచి ఫామ్ లోకి వస్తున్న సమయంలోనే దురదృష్టం వెంటాడుతుంది.

గత ఏడాదేప్పుడో విడుదల కావాల్సిన ‘అర్జున్ సురవరం’ ఇప్పటికి విడుదల కాలేదు. అసలెప్పుడు విడుదలవుతుందో ఆ యంగ్ హీరో నిఖిల్ కూడా చెప్పలేని పరిస్థితి. మొదట ఈ సినిమాకు ముద్ర అని టైటిల్ పెట్టారు. అదే టైటిల్ తో జగపతిబాబు, రావు రమేష్ ముఖ్య పాత్రలతో ఓ మూవీ వచ్చింది.  దాంతో టైటిల్ మార్చి అర్జున్ సురువరం అని మార్చారు.  కానీ ఆ సినిమా ఇప్పటికీ థియేటర్లో రిలీజ్ కాలేదు సరికదా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని అయోమయ పరిస్థితి.

హీరో నిఖిల్ కూడా అర్జున్ సురవరం సినిమాతో ఎలాంటి సంబంధం లేనట్టుగా వ్యవహరించడంతో ఈ మూవీ రిలీజ్ పై మరిన్ని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమా పరిస్థితి పక్కనబెడితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న నిఖిల్ శ్వాస సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందనే ఫిలిమ్ వర్గాల్లో టాక్. అయితే ఈ మూవీ అనుకున్నట్టుగా రాకపోవడంతో శ్వాస సినిమా షూటింగ్ నిలిపివేసినట్టుగా టాక్. 

ఇప్పటికే పూర్తయిన సినిమా రిలీజ్ కాక..సెట్స్ పై ఉన్న సినిమా ఆగిపోవడం చూస్తుంటే నిఖిల్ కి బ్యాడ్ టైమ్ మాములుగా లేదనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి ఊరట ఇచ్చే విషయం ఏంటేంటే.. కార్తికేయ 2 షూటింగ్ కంటిన్యూ కావడం. ఈ మూవీకి ఎలాంటి అవరోధాలు రాకుండా హిట్ కొడితే మనోడి కెరీర్ ముందుకు సాగుతుందని..లేదంటే కష్టాలు తప్పవని ఫిలిమ్ వర్గాలు చర్చలు నడుస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: