దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఏ హీరో ఐనా ఎగిరి గంతేస్తాడు. తమ సినిమా కెరీర్లో ఒక్క సినిమా ఐనా రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉన్న హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి తీసిన ఏ సినిమా ఐనా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టింస్తుంది. ఇతర భాషలలో కూడా రాజమౌళి సినిమాలో నటించిన హీరోలకు మంచి గుర్తింపు వస్తుంది. 
 
కానీ రాజమౌళి సినిమాల్లో నటించే హీరోలను ఒక బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో స్టుడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాల్లో నటించాడు. కానీ ఆ సినిమాల తరువాత వచ్చిన సుబ్బు, ఆంధ్రావాలా, కంత్రి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. రాజమౌళి నితిన్ కాంబోలో వచ్చిన సై సినిమా తరువాత నితిన్ హిట్టు కొట్టడానికి ఇష్క్ సినిమా దాకా ఎదురు చూడాల్సి వచ్చింది. 
 
రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రభాస్ కు ఛత్రపతి తరువాత పౌర్ణమి, రవితేజకు విక్రమార్కుడు తరువాత ఖతర్నాక్, నానికు ఈగ తరువాత ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తున సాహో సినిమాను ఈ సెంటిమెంట్ వెంటాడుతుంది. మరి ప్రభాస్ సాహో సినిమాతో ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలంటే ఆగష్ట్ 15దాకా ఆగాల్సిందే 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: