బాలీవుడ్ బాద్ షా సౌత్ సినిమాలో విలన్ గా కనిపించడమా? అంటూ మాట్లాడుకుంటున్నారంతా. గత కొంతకాలంగా కింగ్ ఖాన్ షారుక్ వరుస ఫ్లాపులతో క్రేజ్ కోల్పోయారని ప్రచారం అవుతుంది. 


ఓ వైపు ఆస్థి వివాదాలు, కోర్టులు అంటూ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఇబ్బందుల్లో ఉండగానే కెరీర్ పరంగా రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా 2018-19 సీజన్ షారుఖ్ కి పీడకలలాంటిది అని చెప్పాలి. జీరో ఫ్లాప్ తర్వాత అతడిపై రూమర్స్ మరీ ఎక్కువైపోయాయి.


అయితే వీటన్నిటి నడుమ అతడు ఒక సౌత్ స్టార్ సినిమలో విలన్ గా నటిస్తున్నాడు అనే ప్రచారం వైరల్ అవుతుంది. విజయ్ నటిస్తున్న టీజర్ సినిమా బిగిల్ లో షారుఖ్ ఓ అతిధి పాత్రలో నటిస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే షారుక్ అతిధి పాత్రా కాదు ఏకంగా విలన్ పాత్రలో నటిస్తున్నాడు అనేది తాజా వార్త. 
15 నిమిషాల పాటు బిగిల్ సినిమాలో కనిపిస్తారట. విజయ్ తో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుంది. కథని కీలక మలుపు తిప్పే విలన్ పాత్రా ఇది అని కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలో ప్రచారమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: