తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి తమిళ నాట స్టార్ హీరోగా ఎదిగారు విక్రమ్.  తమిళంలో ఆయనను చియాన్ విక్రమ్ అంటారు.  భారత చలన చిత్ర రంగంలో కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించారు విక్రమ్.  శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి చిత్రాలు విక్రమ్ నటనా ప్రతిభకు నిదర్శనాలు. తాజాగా చియాన్ విక్రమ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ‘మిస్టర్ కేకే’చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ఈ ట్రైలర్ చూస్తుంటే  పూర్తి తరహా యాక్షన్ భరిత చిత్రంగా కనిపిస్తుంది. చీకటి రాజ్యం ఫేమ్ రాజేష్ ఎమ్ సెల్వ ఈ చిత్రానికి దర్శకుడు.  క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.  ఈ ట్రైలర్ లో విక్రమ్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు.

' నువ్వు ఆడుకున్నది నాతో కాదు.. యముడితో.. అంటూ విక్రమ్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలో కమల్ కూతురు అక్షర హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: