తెలుగులో ఆకట్టుకున్న 'ప్రస్థానం' హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆ సినిమాను రూపొందించిన దర్శకుడు దేవా కట్టా హిందీలో కూడా ఆ సినిమాను రూపొందిస్తున్నాడు.
 
తెలుగులో సాయికుమార్ చేసిన పాత్రను హిందీలో అక్కడి స్టార్ హీరో సంజయ్ దత్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ఈ సినిమాకు స్వయంగా సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు సంజయ్ దత్.


ఈ సినిమాను సంజయ్ దత్ భార్య మాన్యత నిర్మించింది. ఓవరాల్ గా ఇది సంజయ్ దత్ హోం ప్రొడక్షన్ సినిమా. చాలా కాలం పాటు ప్రతిపాదనలో ఉండి చివరకు ఆ సినిమా ప్రారంభం అయ్యింది. విడుదలకు తేదీని - చిన్నపాటి టీజర్ ను కూడా వదిలారు.


సెప్టెంబర్ 20న ఈ సినిమా విడుదల కాబోతూ ఉంది. తెలుగులో ఆకట్టుకున్న సినిమాలు ఈ మధ్య కాలంలో హిందీలో కూడా మంచి హిట్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో 'ప్రస్థానం' కూడా హిందీలో ఆకట్టుకునే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: